twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబుల్ దమాకా కాస్త డీలాపడింది !

    By Staff
    |

    విజయ దశమికి 'దేవీ' వరిస్తుందని, దసరా సెలవులు అనుకూలమవుతాయని భావించి వివిధ బిన్న కోణాల్లో రూపొందించిన కొత్త చిత్రాలు పండుగకి ముందే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డబుల్ దమాకా గా 'జోష్", 'ఈనాడు", 'శంఖం", 'గణేష్" వచ్చాయి. అయితే అన్ని సినిమాలు మిశ్రమ ఫలితాలనే చవిచూశాయి, కనీసం ఒక్కటి కూడా 'దసరా' కి సరదాగా చూడదగ్గ సినిమా అనే టాక్ తెచ్చుకోలేకపోయింది. రామ్ నటించిన గణేష్ ఓపెనింగ్స్ సైతం చాలా వీక్ గా వున్నాయి మరి 'జస్ట్" మాటో?. నితిన్ 'రెచ్చిపో" ప్రేక్షకుడు చచ్చిపో గా పరిణమించింది. కమల్, వెంకటేష్ నటించిన 'ఈనాడు" సోసో అంటోంది దసరా సెలవుల్లో కూడా, కనీసం థియేటర్ల దగ్గరకి జనాన్ని రాబట్ట లేకపోతోంది. గోపిచంద్ 'శంఖం" సౌండ్ లేకపొయింది. విక్రమ్ సినిమా 'మల్లన్న" వద్దన్నా అంటూ తల బాదుకొంటున్న ప్రేక్షకులు 'బాణం" బాగుందని విమర్షకులు మోచ్చకున్నా ప్రేక్షకాదారణకి నోచుకోలేకపోయింది. దిల్ రాజు, నాగ చైతన్యల జోష్ లేని 'జోష్" ఫెస్టివల్ సీజన్ ని కూడా వసూళ్లని చేసుకోలేక ప్లాప్ గా ముద్రపడిపోయింది. యాభై రోజుల బ్రహ్మరథం పట్టిన తర్వాత కొత్త సన్నివేశాలు కలపడం 'మగధీర" కి మరింతగా కలిసొచ్చింది. గత పది రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు గణనీయంగా పెరిగి అన్ని సినిమాల్లోకి టాప్ వన్ లో నిలిచింది. ఏదైనా దసరా సినిమాలు నిరాశపరిస్తే 'మగధీర" మాత్రం ఇప్పట్లో చేధించడం కష్టమనిపించే స్థాయిలోవసూళ్ల రికార్డుని ఇంకా పెంచుతూ పోతుంది. మరి అక్టోబర్ లో దీపావలికి విడుదల కానున్న 'మగధీర" కి సవాల్ గా నిలిచే విడుదలకు సిద్ద పడుతోన్న సినిమాలు ఏ పరిస్థితులను ఎదుర్కొంటాయో వేచి చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X