తెలుగు,తమిళ భాషల్లో విడుదలైన కమల్ హాసన్ 'దశావతారం' సినిమా యావరేజి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కి కొదవలేదు. తెలుగు పరిశ్రమ ముక్కునవేలేసుకునే ఓపినింగ్స్ వచ్చాయి. అలాగే కమల్ సినీ కెరీర్ లోనూ రికార్డులు సృష్టించిన చిత్రమిది. దాంతో ఆ సినిమా అటు బయ్యర్లుకు,ఇటు నిర్మాతలకు లాభాలు పంచుతుందనటంలో సందేహం లేదు. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చిన పాండురంగడు కలెక్షన్లు అలాగే స్టడీగానే ఉన్నాయి.పుంజుకోనూలేదు.పడిపోనూలేదు. ఇక పరుగు యాభై రోజుల పండుగ జరుపుకుంది. ఇక బుజ్జిగాడు సోసో గా ఉన్నాడు. బి.సి.సెంటర్లపై పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి. తర్వాత వచ్చిన చిన్న సినిమాలు సోంబేరి,అధ్యక్ష్యా అయితే సోదిలోకి కూడా రావటంలేదు. ఇక ఈ గురవారం రామ్,జెనీలియా జంటగా శ్రీను వైట్ల రూపొందించిన రెడీ రిలీజైంది. బ్రహ్మానందం కామిడీ హైలట్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.