DD Returns Collections బ్లాక్‌బస్టర్ దిశగా చిన్న సినిమా.. కామెడీ హారర్ తమిళ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
చిన్న సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్లు వసూలు చేస్తే సినీ పరిశ్రమకు వచ్చే జోష్ మరోలా ఉంటుంది. అలాంటి చిన్న చిత్రమే తమిళ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నది. నూతన దర్శకుడు ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్‌లో రమేష్ కుమార్ నిర్మించిన డీడీ రిటర్న్ (డేర్ డెమాన్స్ రిటర్న్స్) చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా గురించిన విశేషాలు, మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డీడీ రిటర్న్ (డేర్ డెమాన్స్ రిటర్న్స్) సినిమా విషయానికి వస్తే.. కామెడీ హారర్ సినిమా. ఈ చిత్రంలో సంతానం, సురభి, రెడిన్ కింగ్ల్సే, ప్రదీప్ రావత్‌తోపాటు చిన్న నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఓఫ్రో సంగీతం అందించగా, దీపక్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

డీడీ రిటర్న్ (డేర్ డెమాన్స్ రిటర్న్స్) సినిమాను భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను సుమారు 12 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమాను కేవలం తమిళనాడులోనే రిలీజ్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ సినిమాను 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
డీడీ రిటర్న్ (డేర్ డెమాన్స్ రిటర్న్స్) సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడటంతో డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 60 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు ఓవరాల్‌గా రెండో రోజు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
డీడీ రిటర్న్ (డేర్ డెమాన్స్ రిటర్న్స్) సినిమా టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్లకు మంచి స్పందన రావడంతో విడుదలకు ముందే మంచి క్రేజ్, బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద 2.6 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

డీడీ రిటర్న్ (డేర్ డెమాన్స్ రిటర్న్స్) మూవీకి రెండో రోజు భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపించింది. ఈ సినిమా రెండో రోజు 3 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. డీడీ రిటర్న్స్ మూవీ రెండో రోజు శనివారం 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు కంటే అధికంగా కలెక్షన్లను రాబట్టడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను తెలియజెప్పింది.
డీడీ రిటర్న్స్ చిత్రం మూడో రోజు తొలి రోజుల కంటే ఎక్కువగా వసూళ్లను నమోదు చేసింది. మూడో రోజు తమిళనాడులో 3.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 8.55 కోట్ల రూపాయలను మూడు రోజుల్లో రాబట్టింది.


Click it and Unblock the Notifications











