De De Pyaar De 2 Day 1 Collections: కేసరి, జాట్ రికార్డ్స్ బ్రేక్..అజయ్ దేవగణ్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
టీ సిరీస్ ఫిల్మ్స్, లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృషాణ్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన చిత్రం దే దే ప్యార్ దే 2. అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు. మాధవన్, జావెద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ, గౌతమి కపూర్, ఇషిత దత్తా, సంజీవ్ సేథ్, సుహాసినీ ములే, గ్రేసి గోస్వామి తదితరులు కీలకపాత్రలు పోషించారు. దే దే ప్యార్ దే 2 మూవీకి లవ్ రంజన్ కథ అందించగా.. సుధీర్ కే చౌధురి సినిమాటోగ్రాఫర్‌గా, చేతన్ ఎం సోలంకి ఎడిటర్‌గా వ్యవహరించారు. యోయో హనీ సింగ్, జానీ, ఆదిత్య దేవ్, పాయల్ దేవ్, అవ్వీ స్రా, సాగర్ భాటియాలు స్వరాలు సమకూర్చగా... హితేష్ సోనిక్ నేపథ్య సంగీతం అందించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో దే దే ప్యార్ దే 2 మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు అజయ్ దేవగణ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
2019లో వచ్చిన దే దే ప్యార్ దే చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా దే దే ప్యార్ దే 2ను తెరకెక్కించారు. పార్ట్ 1లో నటించిన వారిలో టబు ఈసారి మిస్ అవ్వగా.. విలక్షణ నటుడు మాధవన్ రాకతో పార్ట్ 2కి మంచి క్రేజ్ దక్కింది. దాంతో అజయ్ దేవగణ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

దే దే ప్యార్ దే 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ కలిపి దే దే ప్యార్ దే 2 చిత్రానికి 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టగా ఇందుకోసం దాదాపు 15 కోట్ల రూపాయల్ని నిర్మాతలు ఖర్చు పెట్టినట్లుగా బీటౌన్ టాక్. అలాగే డిస్ట్రిబ్యూషన్, సెన్సార్ ఖర్చుల కింద మరో 5 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. దాంతో మొత్తంగా అజయ్ దేవగణ్ మూవీకి 100 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
దే దే ప్యార్ దే 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
అజయ్ దేవగణ్ లాంటి సూపర్‌స్టార్‌తో రకుల్ ప్రీత్ సింగ్, మాధవన్ కలిసి నటిస్తుండటంతో టీజర్, ట్రైలర్ల కారణంగా దే దే ప్యార్ దే 2 మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ దాదాపు 30 కోట్ల రూపాయలకు ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లుగా సమాచారం. దే దే ప్యార్ దే 2 మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 110 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
దే దే ప్యార్ దే 2 కలెక్షన్స్
అజయ్ దేవగణ్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపింది. ప్రీ సేల్స్‌లో ఇండియా వైడ్‌గా 12,947 షోలకు గాను దాదాపు 91 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో దే దే ప్యార్ దే 2 మూవీకి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సుమారుగా 2.79 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. తొలి రోజు హిందీ వెర్షన్‌లో ఈ సినిమాకు సాయంత్రం 4 గంటల వరకు 8 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది.
అక్షయ్, సన్నీడియోల్‌ల రికార్డ్స్ బద్ధలు
ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగణ్ మూవీకి 2 కోట్ల రూపాయల వరకు నికర వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు మరింత ఆక్యూపెన్సీ పెరిగే అవకాశం ఉండటంతో దే దే ప్యార్ దే 2 మూవీకి తొలిరోజు హిందీలో 4 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి 50 లక్షల రూపాయల చొప్పున 7 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అజయ్ దేవగణ్ మూవీ కేసరి చాప్టర్ 2 (1.84 కోట్ల రూపాయలు), జాట్ (2.59 కోట్ల రూపాయలు), భూల్ చుక్ మాఫ్ (88 లక్షల రూపాయలు) చిత్రాల ఓపెనింగ్స్‌ను అధిగమించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











