De De Pyaar De 2 Day 12 Collections: దే దే ప్యార్ దే 2 వసూళ్ల జాతర... 100 కోట్ల క్లబ్‌లోకి రకుల్ ప్రీత్ మూవీ

బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం దే దే ప్యార్ దే 2. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దే దే ప్యార్ దేకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. టీ సిరీస్ ఫిల్మ్స్, లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృషాణ్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. మాధవన్, జావెద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ, గౌతమి కపూర్, ఇషిత దత్తా, సంజీవ్ సేథ్, సుహాసినీ ములే, గ్రేసి గోస్వామి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

దే దే ప్యార్ దే 2 మూవీకి లవ్ రంజన్ కథ అందించగా.. సుధీర్ కే చౌధురి సినిమాటోగ్రాఫర్‌గా, చేతన్ ఎం సోలంకి ఎడిటర్‌గా వ్యవహరించారు. యోయో హనీ సింగ్, జానీ, ఆదిత్య దేవ్, పాయల్ దేవ్, అవ్వీ స్రా, సాగర్ భాటియాలు స్వరాలు సమకూర్చగా... హితేష్ సోనిక్ నేపథ్య సంగీతం అందించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో దే దే ప్యార్ దే 2 మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 12వ రోజు అజయ్ దేవగణ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

De De Pyaar De 2 Day 12 expected Box Office Collections Worldwide Ajay Devgn s entered into the 100 crore club movie

దే దే ప్యార్ దే 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ కలిపి దే దే ప్యార్ దే 2 చిత్రానికి 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రింట్స్, పబ్లిసిటీ కార్యక్రమాల కోసం దాదాపు 15 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూషన్, సెన్సార్ ఖర్చుల కింద మరో 5 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. దాంతో మొత్తంగా అజయ్ దేవగణ్ మూవీకి 100 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దే దే ప్యార్ దే 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా దే దే ప్యార్ దే 2 మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ దాదాపు 30 కోట్ల రూపాయలకు ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లుగా సమాచారం. అజయ్ దేవగణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 110 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

దే దే ప్యార్ దే 2 కలెక్షన్స్
దే దే ప్యార్ దే 2 మూవీకి తొలిరోజున 8.75 కోట్ల రూపాయలు, 2వ రోజున 12.25 కోట్ల రూపాయలు, 3వ రోజున 13.75 కోట్ల రూపాయలు, 4వ రోజున 4.25 కోట్ల రూపాయలు, 5వ రోజున 5.25 కోట్ల రూపాయలు, 6వ రోజున 3.5 కోట్ల రూపాయలు, 7వ రోజున 3.35 కోట్ల రూపాయలు, 8వ రోజున 2.25 కోట్ల రూపాయలు, 9వ రోజున 4 కోట్ల రూపాయలు, 10వ రోజున 4.35 కోట్ల రూపాయలు, 11వ రోజున 1.5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు 63.2 కోట్ల రూపాయల నెట్.. 75.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. అటు ఓవర్సీస్‌లో దే దే ప్యార్ దే 2 సినిమాకు 22 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి అజయ్ దేవగణ్ మూవీకి 11 రోజుల వరకు 97.5 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా సాక్‌నిక్ నివేదించింది.

దే దే ప్యార్ దే 2 12వ రోజు కలెక్షన్స్
మస్తీ 4, 120 బహదూర్ సినిమాల నుంచి గట్టి పోటి ఎదురవుతున్నా దే దే ప్యార్ దే 2 మూవీ స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది. 12వ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ సినిమాకు 10 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ లభించినట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో 12వ రోజు అజయ్ దేవగణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మంగళవారం నాటి వసూళ్లతో దే దే ప్యార్ దే 2 మూవీ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజా వసూళ్లతో 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో భూల్ చుక్ మాఫ్‌ను అధిగమించి దే దే ప్యార్ దే 2 చిత్రం మూడో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X