రూ. 50 కోట్లు వచ్చాయి... ఊపిరి పీల్చుకున్న రకుల్ ప్రీత్, సూపర్ హ్యాపీ!
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' తొలి రోజు డీలా పడ్డప్పటికీ పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. మంగళవారంతో బాక్సాఫీసు వద్ద 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 50 కోట్ల మార్క్ రీచ్ అయింది.
భవిష్యత్తులో బాలీవుడ్లో సెటిలవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్న హీరోయిన్ రకుల్.. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే తొలిరోజు ఫలితాలు చూసి షాకైంది. అయితే రెండో రోజు నుంచి పరిస్థితిలో మార్పు రావడంతో ఆమెలో కొత్త ఉత్సాహం మొదలైంది.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన 'దే దే ప్యార్ దే' తొలి రోజు రూ. 10.41 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ప్లాప్ అనే ప్రచారం మొదలైంది. అయితే ఊహించని విధంగా శనివారం రూ. 13.39 కోట్లు, ఆదివారం రూ. 14.74 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ రావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

రకుల్ గ్లామర్ షో కూడా సినిమాకు ఆదరణ పెరగడానికి కారణం అని కొందరంటున్నారు. సోమవారం వీక్ డే కావడంతో రూ. 6.19 కోట్లు రాబట్టింది. దీంతో టోటల్ వసూళ్లు రూ. 44.73 కోట్లకు రీచ్ అయింది. మంగళవారం రూ. 50 కోట్ల మార్కును అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఇండియా వ్యాప్తంగా 3100 స్క్రీన్లలో విడుదల చేశారు. అజయ్ దేవగన్ ఇతర సినిమాలతో పోలిస్తే ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ యావరేజ్ అనే స్థాయిలో ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఫుల్ రల్‌లో సంతృప్తికర ఫలితాలు ఇస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











