Box Office: రకుల్ ప్రీత్ సింగ్ బాక్సాఫీస్ హంగామా.. 100 కోట్ల వైపు రొమాంటిక్ కామెడీ మూవీ పరుగులు
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం దే దే ప్యార్ దే 2. 2019 సంవత్సరంలో రిలీజైన దే దే ప్యార్ దే సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రూపొందింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీకి అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు లవ్ రంజన్, తరుణ్ జైన్ కథను అందంచారు. ఈ సినిమాను టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, కిషన్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించారు.
ఈ చిత్రంలో జావెద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్దా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రముఖ ర్యాపర్ యో యో హానీ సింగ్, జానీ పాటలు అందించారు. హృతిక్ సోనిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. నవంబర్ 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

దే దే ప్యార్ దే 2 సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ భారీగా నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ పరంగా 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రకుల్ ప్రీత్, అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా తొలి రోజు 9 కోట్ల రూపాయలు, రెండో రోజు 12 కోట్ల రూపాయలు, మూడో రోజు 14 కోట్ల రూపాయలు, 4వ రోజు 4.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 6వ రోజు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయల నెట్, 60 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీ రెస్సాన్స్ లభించింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో భారీగానే వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్‌లో 16 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











