1675 కోట్ల బడ్జెట్.. 3 రోజుల్లోనే 3000 కోట్లతో సరికొత్త చరిత్ర.. ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మార్వెల్ సిరీస్‌లో భాగంగా భారీ అంచనాలతో వచ్చిన డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్నది. ఇటీవల కాలంలో ఏ హాలీవుడ్ సినిమా సాధించిన విధంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వేటను మొదలుపెట్టింది. మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం జూలై 26వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ అమెరికన్ సూపర్ హీరో నేపథ్యంగా సాగే మార్వెల్ కామిక్ పాత్రలతో కూడిన సినిమా. ఈ చిత్రాన్ని మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమాకు షాన్ లెవీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ, మ్యాథ్ూ మెక్‌ఫాడైన్ తదితరులు నటించారు.

డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను 200 మిలియన్ల డాలర్లతో అంటే.. సుమారుగా 1675 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 25000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలోనే 1600 స్క్రీన్లలో ప్రదర్మిస్తున్నారు.
డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ చిత్రం తొలి రోజు ఘనంగా ఈ సినిమా కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రం ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ సుమారుగా 12 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 7.5 కోట్లు, తెలుగులో 1.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. 22.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక అమెరికాలో ఈ చిత్రం తొలి రోజే రికార్డు వసూళ్లను రాబట్టింది. లాటిన్ అమెరికాలోని మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాల్లో 2వ అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మెక్సికోలో 6.6 మిలియన్ డాలర్లు, యూకేలో 6 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌లో 3.6 మిలియన్ డాలర్లు, ఇటలీలో 3.5 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 3.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ఇక అమెరికాలో ఈ సినిమా తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది. ఈ సినిమా 36 మిలియన్ డాలర్లు అంటే 300 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ డాలర్లు అంటే 670 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తొలి వారాంతం అంటే మూడు రోజుల్లో 360 మిలియన్ డాలర్లు అంటే.. 3000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











