3 రోజుల్లో 3720 కోట్లు.. డెడ్‌పూల్ వాల్వరిన్ బాక్సాఫీస్‌ ఊచకోత .. ఇండియాలో ఎన్ని కోట్లంటే?

అమెరికన్ మార్వెల్ కామెడీ చిత్రం డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. జూలై 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం రికార్డుస్థాయి కలెక్షన్లను నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది. ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ, మ్యాథ్ూ మెక్‌ఫాడైన్ తదితరులు నటించిన చిత్రం రిలీజైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమా గత మూడు రోజుల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న మార్వెల్ సినిమా డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ ‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రాన్ని 200 మిలియన్ల డాలర్లతో అంటే.. సుమారుగా 1675 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 25000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలోనే 1600 స్క్రీన్లలో ప్రదర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ కోసం రాసిన సంభాషణలకు ప్రేక్షకులకు కొత్త అానుభూతిని కలిగిస్తున్నాయి. దాంతో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నది.

Deadpool amp amp Wolverine day 3 Collections American comic Marvel rocking at Global Box Office

ఇండియాలో వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు బ్రహ్మండమైన రెస్సాన్స్ వస్తున్నది. తొలి రోజు ఇంగ్లీష్ వెర్షన్‌కు 11 కోట్ల రూపాయలు, హిందీలో 8 కోట్ల రూపాయలు, తెలుగు, తమిళంలో 1 కోటి రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఇంగ్లీష్‌లో 13 కోట్లు, హిందీలో 8 కోట్లు, తెలుగులో 70 లక్షలు, తమిళంలో 1.3 లక్షలు రాబట్టింది. ఇక ఆదివారం 3వ రోజు 11.5 కోట్ల రూపాయలు, హిందీలో 10 కోట్లు, తెలుగులో 70 లక్షలు, తమిళంలో 1.5 కోట్లు వసూలు చేసింది.

గత మూడు రోజుల్లో డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున 21 కోట్లు, రెండో రోజున 23 కోట్లు, మూడో రోజున 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 68 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Deadpool amp amp Wolverine day 3 Collections American comic Marvel rocking at Global Box Office

డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ సినిమా గత 3 రోజుల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ట్రేడ్ వర్గాల అంచనాలను కూడా అధిగమించింది. ఈ చిత్రం 3 రోజుల్లో 440 మిలియన్ డాలర్లు రాబట్టింది. నార్త్ అమెరికాలో 205 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1720 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దాంతో డెడ్ పూల్ చిత్రం గత 3 రోజుల్లో సుమారుగా 3720 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల కాలంలో హాలీవుడ్‌లోను, ఓవర్సీస్‌లోను ఏ సినిమా కూడా సాధించని విధంగా ఈ చిత్రం వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: deadpool amp wolverine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X