4 రోజుల్లో 4400 కోట్ల కలెక్షన్లు.. అవతార్ రికార్డును బ్రేక్ చేసిన డెడ్‌పూల్
ప్రపంచ సినిమాలో అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన డెడ్ పూల్ అండ్ వాల్వెరిన్ చిత్రం రికార్డులను తిరగరాస్తున్నది. ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ, మ్యాథ్యూ మెక్‌ఫాడైన్ తదితరులు నటించిన చిత్రం అవతార్ లాంటి సంచలన సినిమా ఓపెనింగ్స్‌ను అధిగమించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జూలై 26వ తేదీన రిలీజైన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మార్వెల్ యాక్షన్ థీమ్‌తోపాటు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమాను 200 మిలియన్ల డాలర్లతో అంటే.. సుమారుగా 1675 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడటంతో రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 25000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలోనే 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు 21 కోట్ల రూపాయలు, రెండో రోజు 23 కోట్ల రూపాయలు, మూడో రోజు 22.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఈ చిత్రం సుమారుగా 70 శాతం క్షీణించింది. అయితే సోమవారం సాధారణంగా వచ్చే కలెక్షన్లతో పోల్చుకొంటే ఈ చిత్రం భారీగానే వసూళ్లను రాబట్టింది.
ఇక 4వ రోజు ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇంగ్లీష్ వెర్షన్ 3.5 కోట్లు, హిందీలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 30 లక్షల రూపాయలు, తమిళంలో 40 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దాంతో మొత్తంగా 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 4 రోజుల్లో 75 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.

డెడ్ పూల్ అండ్ వాల్వెరిన్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. 2016లో వచ్చిన డెడ్‌పూల్ సినిమా 264 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే.. తాజా సీక్వెల్ 444 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఇటీవల రిలీజై అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ సినిమా కలెక్ట్ చేసిన 439 మిలియన్ డాలర్ల వసూళ్లను బ్రేక్ చేసింది.
డెడ్ పూల్ అండ్ వాల్వెరిన్ చిత్రం తొలి వీకెండ్‌లో పలు రకాల రికార్డులను అధిగమించింది. జోకర్ సినిమాతోపాటు ఇతర చిత్రాలను రికార్డులను తుడిచిపెట్టింది. జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లో 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











