9 రోజుల్లో 5800 కోట్ల రూపాయలు.. ఇండియాలో 100 కోట్లు.. మార్వెల్ బాక్సాఫీస్ సంచలనం!
మార్వెల్ మూవీ డెడ్‌పూల్ అండ్ వాల్వరిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ఇండియాలో కూడా ఈ సినిమా అరుదైన మైలురాయిని చేరుకొన్నది. జూలై 26వ తేదీన రిలీజైన ఈ యాక్షన్ కామెడీ ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది. ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ, మ్యాథ్యూ మెక్‌ఫాడైన్ తదితరులు నటించిన చిత్రం రిలీజైన అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, గత 9 రోజుల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న మార్వెల్ సినిమా డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రాన్ని 200 మిలియన్ల డాలర్లతో అంటే.. సుమారుగా 1675 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 25000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలోనే 1600 స్క్రీన్లలో ప్రదర్మిస్తున్నారు.

ఇండియాలో ఈ చిత్రం తొలివారం రికార్డు వసూళ్లు సాధించింది. ఇంగ్లీష్ వెర్షన్ 47 కోట్లు, హిందీ 35 కోట్లు, తెలుగు 3.5 కోట్లు, తమిళ వెర్షన్ 5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందది. దాంతో ఈ సినిమా మొత్తంగా తొలివారం 90 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.
ఇక డెడ్‌పూల్ అండ్ వాల్వరిక్ చిత్రం రెండో వారంలో కూడా ఘనంగా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా 8వ రోజున 4.5 కోట్ల రూపాయలు, 9వ రోజున కూడా 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 99 కోట్ల రూపాయలు నికరంగా, 120 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది.

అలాగే ఈ చిత్రం అమెరికా, ఇతర దేశాల్లో భారీగానే కాకుండా సంచలన కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం అవతార్2, డాక్టర్ స్ట్రేంజ్, థోర్ లవ్ అండ్ థండర్ సినిమాల ఓపెనింగ్స్ కలెక్షన్ల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
అమెరికాలో డెడ్‌పూల్ అండ్ వాల్వెరిన్ చిత్రం అమెరికాలో 320 మిలియన్ డాలర్లు అంటే 2700 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 5500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5800 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











