For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 డేస్ రిపోర్ట్: ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి? ట్రిమ్ చేస్తారా?

|

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటించిన 'డియ‌ర్ కామ్రేడ్‌ జులై 26న విడుదలైన బాక్సాఫీసు వద్ద డీసెంట్ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేక పోయిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం, స్లో నేరేషన్ వల్ల ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు.

సినిమాను ట్రిమ్ చేయాలంటున్న డిస్ట్రిబ్యూటర్లు

సినిమాను ట్రిమ్ చేయాలంటున్న డిస్ట్రిబ్యూటర్లు

కాగా... ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు రన్ టైమ్ కాస్త ట్రిమ్ చేయాలని నిర్మాతలను కోరుతున్నారట. అయితే సినిమాలో ఏ భాగాన్ని తొలగించి రన్ టైమ్ తగ్గించాలనే విషయంలో దర్శక నిర్మాతలు కాస్త అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోయాయి

ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోయాయి

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో రూ. 6.83 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమాపై ముందు నుంచీ భారీ హైప్ ఉండటమే ఇందుకు కారణం. అయితే రెండో రోజు కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.

2 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే...

2 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే...

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 2.91 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో టోటల్ 2 డేస్ షేర్ 9.74 కోట్లకు రీచ్ అయింది. ఆదివారం వసూళ్లు ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. దీన్ని బట్టే సినిమా ఫేట్ ఏమిటనే విషయంలో ఓ అంచనాకు రావడానికి వీలుంటుంది.

థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు?

థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు?

తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి ఓవరాల్ థియేట్రికల్స్ రైట్స్ రూ. 22.60 కోట్లకు అమ్మినట్లు సమాచారం. నైజాంలో అత్యధికంగా రూ. 9 కోట్ల ధర పలికింది. అయితే ఇక్కడ రెండు రోజుల్లోనే రూ. 4.27 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. కానీ నైజాంతో పోలిస్తే ఇతర ఏరియాల్లో వసూళ్లు శాతం తక్కువగా ఉంది.

ఓవర్సీస్ ఏరియాలో దుమ్ము రేపుతోంది

ఓవర్సీస్ ఏరియాలో దుమ్ము రేపుతోంది

ఓవర్సీస్ ఏరియాలో ఈ చిత్రానికి మంచి స్పందన ఉంది. ప్రీమియర్ షోల ద్వారా $310,824 గ్రాస్ రాబట్టింది. శనివారం నాటికే $510,935 రీచ్ అయింది. ఫస్ట్ వీకెండ్ $750K వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 1 మిలియన్ ఈజీగా రీచ్ అవుతుందనే వాదన వినిపిస్తోంది.

English summary
Dear Comrade 2 days collection report. The movie collected Rs. 6.83 cr share in AP and TS. The film’s latest US gross is $510,935. Dear Comrade is an intense love story between Bobby (Vijay Deverakonda), a student union leader and Lily (Rashmika Mandanna) a state-level cricketer. Bobby has anger management issues, which he needs to overcome and fight for his love.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more