twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వసూళ్ల పరంగా దుమ్మురేపుతున్న డియర్ కామ్రేడ్... అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దలు!

    |

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటించిన డియ‌ర్ కామ్రేడ్‌ మూవీ వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. రిలీజ్ ముందు నుంచే భారీ హైప్ ఉండటంతో అందుకు తగిన విధంగానే ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి.

    భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో రిలీజ్ చేశారు.

    అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దలు

    అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దలు

    యూఎస్ఏ ప్రిమియర్ షో కలెక్షన్స్ విషయంలో ‘అర్జున్ రెడ్డి' రికార్డును తాజాగా ‘డియర్ కామ్రేడ్' బద్దలు కొట్టింది. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 2 లక్షల డాలర్లు రాబట్టింది. తాజాగా ‘డియర్ కామ్రేడ్' ఆ రికార్డును అధిగమించింది.

    ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలు చేస్తుందో?

    ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలు చేస్తుందో?

    యూఎస్ఏ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం 172 లొకేషన్ల నుంచి మే 25 సాయంత్రం 7 గంటలు(అమెరికా కాలమానం) వరకు $259,443 రాబట్టింది. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. టోటల్ ఫిగర్ ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది.

    ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ గ్యారంటీ!

    ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ గ్యారంటీ!

    సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ గ్యారంటీ అంటున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా యూఎస్ఏలో సైతం కన్నడ, మలయాళం, తమిళ వెర్షన్ కూడా విడుదల చేస్తుండటం వసూళ్ల పరంగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.

    2019లొో థర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్

    2019లొో థర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్

    2019లో విడుదలైన ఎఫ్ 2, వినయ విధేయ రామ, మజిలీ లాంటి చిత్రాల ప్రీమియర్ షో వసూళ్లను కూడా అధిగమించి మహర్షి మహర్షి($516K), ఎన్టీఆర్ కథానాయకుడు ($483K) తర్వాతి స్థానంలోడియర్ కామ్రేడ్ నిలిచింది.

    డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

    డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘డియర్ కామ్రేడ్' మూవీ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ అన్ని ఏరియాల్లో కలిపి రూ. 34 కోట్లకు సినిమాను అమ్మినట్లు సమాచారం. విజయ్ కెరీర్లో ది బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌గా దీన్ని పేర్కొంటున్నారు.

    English summary
    Dear Comrade movie crossed Arjun Reddy premieres show collection record in USA. The Movie collected $205,066 from 171 locations at 4 pm PST in USA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X