Fighter Advance booking Collections:హృతిక్ మూవీకి షాకింగ్‌గా అడ్వాన్స్ బుకింగ్.. 1000 కోట్లు కొల్లగొట్టేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ జంటగా నటించిన యాక్షన్, స్పై థ్రిల్లర్ ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మమతా ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అంకు పాండే నిర్మించారు. విశాల్, శేఖర్, చిత్ బల్హారా సంగీతం అందించారు. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జనవరి 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్ రిపోర్టు, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫైటర్ సినిమాను అనిల్ కపూర్, అశుతోష్ రాణా, కరణ్ సింగ్ గ్రోవర్ లాంటి నటులు, టాలెంటెడ్ సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 250 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 250 కోట్లు వాల్యూ కట్టారు.

Deepika Padukones Fighter Predicted Advance booking Collections: Hrithik movie quick start at Box Office

ప్రముఖ నిర్మాణ సంస్థ వయకామ్ 18 ఫైటర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సుమారుగా 5000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీ అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ తెలియజేసింది. 4 రోజుల లాంగ్ వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు అంచనా వేస్తున్నారు.

ఫైటర్ సినిమాలో హృతిక్, దీపిక క్రేజీ కాంబినేషన్‌ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి తొలి రోజు కోసం 60 వేల టికెట్లు నేషనల్ మల్టీ‌ప్లెక్స్‌లో అమ్ముడు పోయాయి. తొలివారం కోసం 150000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోయాయి. దాంతో 3 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి.

Deepika Padukones Fighter Predicted Advance booking Collections: Hrithik movie quick start at Box Office

ఓవర్సీస్‌లో ఫైటర్ సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ మూవీ ఇప్పటికే 500K డాలర్లు అంటే.. సుమారుగా 4.2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7.75 కోట్లు వసూలు చేసింది. హృతిక్ కెరీర్‌లో ఇది అత్యధిక వసూళ్లుగా నమోదు అయ్యాయి.

రిపబ్లిక్ డే పురస్కరించుకొని రిలీజ్ అవుతున్న ఫైటర్ చిత్రం భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశాభావంతో ఉన్నారు. ఈ సినిమా తొలి రోజున 20 నుంచి 30 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశం ఉందని తెలిపారు. దాంతో లాంగ్ వీకెండ్‌లో రికార్డు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X