దీపిక-రణవీర్ వెడ్డింగ్: ఇక నుంచి అఫీషియల్‌గా కండోమ్స్ వాడతారంటూ ట్వీట్!
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ వివాహం బుధవారం లేక్ కోమోలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరిని విష్ చేస్తూ కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ అఫీషియల్ పేజీ ద్వారా విష్ చేస్తూ ట్వీట్ చేసింది.
'దీపిక-రణవీర్‌కు శుభాకాంక్షలు... ఇక నుంచి మీరు అఫీషియల్‌గా అక్కడ రింగ్ తొడుక్కుంటారు' అంటూ డబల్ మీనింగ్ అర్థమొచ్చేలా ఫన్నీ ట్వీట్ చేసింది. ఇక నుంచి రణవీర్-దీపిక అఫీషియల్‌గా కండోమ్స్ వాడతారు అనేలా డూరెక్స్ ట్వీట్ స్పష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కండోమ్ బ్రాండ్ అంబాసిడర్ రణవీర్
డ్యూరెక్స్ కండోమ్ బ్రాండ్‌కు రణవీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగీతి తెలిసిందే. ఒక బాలీవుడ్ మెయిన్ యాక్టర్ కండోమ్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం చూసి అప్పట్లో అంతా ఆశ్చర్య పోయారు. రణవీర్ చేసిన కండోమ్ యాడ్లు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
‘అమూల్' వారు సైతం
‘అమూల్' బ్రాండ్ కూడా ఈ ప్రేమ జంటను విష్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘రణవీర్ ఇకపై సింగల్ కాదు... ది దిపిక్టిన్ ఆఫ్ టేస్ట్' అంటూ ఈ ప్రేమ జంటను విష్ చేసింది.

వైభవంగా దీపిక-రణవీర్ వివాహం
ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియెనెల్లోలో బుధవారం వైభవంగా దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ వివాహం జరిగింది. తొలి రోజు దీపిక కుటుంబ సాంప్రదాయం ప్రకారం కొంకణి స్టైల్‌లో వీరి వివాహం జరిగింది.

అతి కొద్ది మంది అతిథులు మాత్రమే
ఈ వివాహ వేడుకలో రణవీర్, దీపిక కుటుంబ సభ్యులతో పాటు... మరొక 40 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. గురువారం రణవీర్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం సింధి స్టైల్ వెడ్డింగ్ జరుగబోతోంది.


Click it and Unblock the Notifications











