‘ఢిల్లి బెల్లి' తెలుగు రీమేక్ రిజల్ట్
హైదరాబాద్ : బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఢిల్లి బెల్లి చిత్రాన్ని తమిళంలో 'సేట్టయ్' పేరుతో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని తెలుగులో 'క్రేజీ'గా అనువదించి ఉగాది కానుకగా విడుదల చేసారు. వినోదాత్మక కథాంశంతో తీసిన ఈ చిత్రానికి కన్నన్ దర్శకుడు. ఆర్య, హన్సిక, అంజలి ముఖ్యతారాగణం.
ఈ చిత్రం సరిగ్గా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఈ చిత్రానికి మైనస్ ఆర్య.. కి ఇక్కడ మార్కెట్ లేకపోవటం. అలాగే చూసిన వారి నుంచి కూడా మౌత్ టాక్ పుట్టలేదు. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయిన...కామెడీ పెద్దగా పండలేదు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగులలో చాలా భాగం సెన్సార్ వారు మ్యూట్ చేయటం జరిగింది. దాంతో ఆ వర్గం కూడా తృప్తి చెందని స్ధితి.
అయితే సినిమాలో నాజర్ పాత్ర బాగా పేలింది. డాన్ గా నాజర్ పాత్ర గెటప్,డైలాగ్స్ చాలా కామెడీగా పేలాయి. అలీ ట్రాక్ కూడా ఓకే. ఇక ఎన్నో హోప్స్ పెట్టుకున్న నీతూ చంద్ర ఐటం సాంగ్ పేలలేదు. సంతానం కామెడీ పెద్దగా పేలలేదు. ముఖ్యంగా సీన్స్ లో నేటివిటీ మిస్సైంది. ముంబై బ్యాక్ డ్రాప్ తీసుకోవటమే ...మనకు సంభంధం లేని కథ జరుగుతున్న ఫీల్ ఏర్పడింది.
ఈ చిత్రం తెలుగు హక్కులను ఎస్.కె. పిక్చర్స్ సురేష్ కొండేటి చేజిక్కించికున్నారు. సమస్యరెడ్డి కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత జంపా త్రివిక్రమ్, విద్యాసాగర్ వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రీమేక్ అంటే ఉన్నది ఉన్నట్లు కాకుండా స్క్రిప్టులో మన వాతావరణానానికి తగినట్లు మార్పులు చేస్తే బాగుండేది.


Click it and Unblock the Notifications











