Demonte Colony 2 Box Office: 50 కోట్ల మైలురాయికి చేరువగా.. తెలుగులో ఎన్ని కోట్లంటే?
తమిళ సినిమా పరిశ్రమలో సూపర్ నేచురల్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన డీమోంటే కాలనీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నది. ఆ చిత్రానికి ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. BTG యూనివర్సల్ బ్యానర్‌పై జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బాబీ బాలచంద్రన్ నిర్మించారు.ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందనతో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. 11 రోజుల తమిళ కలెక్షన్లు, 3 రోజుల తెలుగు వెర్షన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళ సినిమా పరిశ్రమలో స్మాల్ బడ్జెట్ చిత్రంగా రిలీజై డీమోంటే కాలనీ సంచలన విజయం సాధించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఢిమోంటే కాలనీ చిత్రంలో అరుళ్ నిధి, రమేష్ తిలక్, సనంత్ లాంటి యంగ్ హీరోలు, యోగిబాబు లాంటి టాప్ కమెడియన్ నటించారు. 2015 మే నెలలో రిలీజైన ఈ సినిమాను కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా, వరల్డ్ వైడ్‌గా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన డిమోంటే కాలనీ 2 రూపొందింది.

డిమోంటే కాలనీ 2 సినిమా విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే, కథలోని ట్విస్టులు మూవీకి కనెక్ట్ అయ్యేలా చేసింది. అలాగే సౌండింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి లాంటి విభాగాల పనితీరు స్క్రీన్ మీద నుంచి కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది. దాంతో ఈ సినిమాకు తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
డిమోంటే కాలనీ 2 చిత్రం తమిళంలో తొలి రోజు 4 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రయాణాన్ని మొదలు పెట్టి తొలివారం ముగిసే సమయానికి 21 కోట్ల నికరంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక 9వ రోజు 1.15 కోట్ల రూపాయలు, 10వ రోజు 2.8 కోట్ల రూపాయలు, 11వ రోజు 3.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 28 కోట్ల రూపాయల నికరంగా 38 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
డిమోంటే కాలనీ 2 సినిమాకు తెలుగు వెర్షన్‌కు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. తొలి రెండు రోజుల్లో 1.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కూడా సుమారుగా 75 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 2.4 కోట్ల రూపాయలను నమోదు చేసింది. ఈ సినిమాపై మౌత్ టాక్ పెరుగుతున్నందన రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో 38 కోట్ల గ్రాస్,, తెలుగులో 2.4 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో సుమారుగా 4 కోట్ల రూపాయలతో కలిపి ఈ సినిమా 50 కోట్లకు చేరువైందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











