Demonte Colony 2 Collections: తంగలాన్‌కు ధీటుగా డిమోంటే కాలనీ కలెక్షన్లు.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
తమిళ సినిమా పరిశ్రమలో స్మాల్ బడ్జెట్ చిత్రంగా రిలీజై డీమోంటే కాలనీ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన డిమోంటే కాలనీ 2 చిత్రానికి ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. BTG యూనివర్సల్ బ్యానర్‌పై జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బాబీ బాలచంద్రన్ నిర్మించారు. ఈ సినిమా గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఢిమోంటే కాలనీ చిత్రంలో అరుళ్ నిధి, రమేష్ తిలక్, సనంత్ లాంటి యంగ్ హీరోలు, యోగిబాబు లాంటి టాప్ కమెడియన్ నటించారు. 2015 మే నెలలో రిలీజైన ఈ సినిమాను కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా, వరల్డ్ వైడ్‌గా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

8 ఏళ్ల తర్వాత వచ్చిన డిమోంటే కాలనీ సీక్వెల్‌కు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా.. బాబీ బాలచంద్రన్, విజయ్ సుబ్రమణ్యం, ఆర్సీ రాజ్‌కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అరుల్ నిధి, ప్రియా భవానీ శంకర్, అర్చన రవిచంద్రన్, సెరింగ్ దోర్జి, అరుణ్ పాండ్యన్ నటించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో రూపొందించారు.
తంగలాన్ లాంటి భారీ చిత్రాన్ని ఢీ కొంటూ డీమోంటే కాలనీ 2 చిత్రం బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజు 3.55 కోట్ల రూపాయలు, 2వ రోజు 2.5 కోట్లు, 3వ రోజు 4.5 కోట్లు, 4వ రోజు 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక బాక్సాఫీస్‌కు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం ఈ చిత్రం నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 5వ రోజున 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తంగలాన్‌కు ధీటుగా ఈ సినిమా కలెక్షన్లను రాబట్టడం విశేషంగా మారిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సోమవారం 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసిందని పేర్కొన్నారు.
ఇక డీమోంటే కాలనీ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం అమెరికా, ఇతర ప్రాంతాల్లో కలిపి 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











