For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  30కోట్లు పెడితే 7కోట్లే వచ్చాయి..గోల

  By Srikanya
  |

  రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్‌' బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎంత పెద్ద ప్లాప్ అంటే... 30కోట్లు వ్యయం కాగా కేవలం ఇప్పటివరకు రూ. 7కోట్లే వసూలయ్యాయి అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈచిత్రంలో సంజయ్‌ దత్‌, అమితాబ్‌ బచ్చన్‌, రాణాదగ్గుబాటి, అంజనా సుఖాని, అభిమన్యుసింగ్‌ నటించారు. మే 18న విడుదలైంది.

  ఫలితం నిరాశాజనకంగా ఉండటంతో ఒకరిపై మరొకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు. ఈ నేపధ్యంలో దర్శక నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ తన అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. ఆయన తన ట్వీట్ లో ..ఈ చిత్రంలో సంజయ్‌దత్‌తో పనిచేయటం తనకు చేదు జ్ఞాపకాలు మిగిల్చిందన్నారు. చిత్రం విడుదలతో సంతోషంగానే ఉన్నాను. కాని సంజయ్‌ దత్‌, ధరమ్‌ ఓబెరాయ్‌లను నా జీవితకాలంలో చూడకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని వర్మ తన ట్విట్టర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు.

  షూటింగ్‌ జరుగుతున్నపుడే సంజయ్‌కు వర్మకు అభిప్రాయ భేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కాని మీడియాతో సమావేశాలలో ఇద్దరూ ఈ విషయాన్ని ఖండించారు. వర్మ దర్శకత్వాన్ని దత్‌, ఓబెరాయ్‌ తప్పు పట్టారు. కాగా రానున్న వారి చిత్రాలలో తాను కనిపించనని అందువల్ల ఇద్దరూ సంతోషంగా ఉండవచ్చని వర్మ రాశారు.ఇక ఈ చిత్రం కథ..ఇప్పటిదాకా అండర్‌వరల్ట్‌ ఇతివృత్తంగా బాలీవుడ్‌లో విడుదలైన చిత్రాలను 'డిపార్ట్‌మెంట్‌' గుర్తు చేస్తుంది.

  కథ ప్రకారం ముంబాయిలో మాఫియా బెడదను నిర్మూలించేందుకు మహదేవ్‌ భోంస్లే (సంజయ్‌దత్‌) 'డిపార్ట్‌మెంట్‌' పేరుతో కష్టించే పనిచేసే పోలీస్‌ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. కొత్తగా చేరిన శివ్‌ నారాయణ్‌తో (రానా దగ్గుబాటి) కూడిన ఆ బృందం ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ క్రమంలో నేతగా మారిన గ్యాంగ్‌స్టర్‌ సర్జేరావు గైక్వాడ్‌ను(అమితాబ్‌ బచ్చన్‌) నారాయణ్‌ కలుసుకుంటాడు. బృందంలో ప్రతి ఒక్కరూ కనిపించేంత నిజాయతీపరులు కారని, ఎవరికి వారే తమదైన రహస్య ఎజెండాతో పనిచేస్తున్నారనే నిజాన్ని నారాయణ్‌ తెలుసుకుంటాడు.

  రానా గర్ల్‌ఫ్లెండ్‌గా అంజనా సుఖాని, సంజయ్‌ దత్‌ భార్యగా మంచు లక్ష్మీ ప్రసన్నలకు నటించటానికి పెద్దగా అవకాశం లేకుండాపోయింది. ఫిమేల్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన మధుశాలిని, ఐటెమ్‌ సాంగ్‌కు పరిమితమైన నథాలియా కౌర్‌ను కెమెరా చూపించినతీరు నిజంగా అసభ్యకరంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. రివ్యూ ల మీద సైతం వర్మ మండిపడ్డారు.

  English summary
  
 Ram Gopal Varma directed Bollywood movie Department has received a very dismal opening at the worldwide Box Office. Amitabh-Sanjay-Rana starrer action flick has raked in approximately Rs 7 crore from the collection centres in India, UK, Australia and New Zealand. Department registered 10% to 15% occupancy at both multiplexes as well as single screens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X