Desert Warrior Box Office: 1400 కోట్లతో తీస్తే 6 కోట్లు.. ఆల్‌టైం బాక్సాఫీస్ డిజాస్టర్‌గా డెజర్ట్ వారియర్!

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమలు తమ మార్కెట్‌ను పెంచుకుంటూ కాసుల పంట పండించుకుంటున్నాయి. హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండగా.. కొరియన్, చైనీస్, నాలీవుడ్, జపనీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు మంచి గుర్తింపు ఉంది. భారత్ నుంచి చూస్తే బాలీవుడ్‌కు కూడా నార్త్ అమెరికా, పర్షియన్ - గల్ఫ్, యూరప్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో మంచి మార్కెట్ ఉంది. తాము కూడా ఇదే స్థాయికి చేరుకోవాలని పలు దేశాల సినీ పరిశ్రమలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. అలా ప్రయత్నించిన ఓ సినిమా.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్రలోనే ఆల్‌టైం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’

సౌదీ అరేబియా బిగ్ డ్రీమ్
ఎడారి దేశం సౌదీ అరేబియా తన దేశ సినిమా ప్రతిష్టను పెంచాలని, వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డెజర్ట్ వారియర్ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సౌదీ అరేబియాకు చెందిన మీడియా దిగ్గజం ఎంబీసీ గ్రూప్ ఈ సినిమాను 2021లో ప్రకటించింది. క్రీస్తుశకం 7వ శతాబ్ధంలో తమ గడ్డపైనే జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా డెజర్ట్ వారియర్‌కు రూపకల్పన చేసింది. ఈ సినిమాపై ప్రపంచం దృష్టి పడాలనే ఉద్దేశంతో భారీ స్టార్ క్యాస్టింగ్‌ని ఎంపిక చేసింది ఎంబీసీ గ్రూప్.

Desert Warrior Becomes Biggest Box Office Disaster in World Cinema History

డెజర్ట్ వారియర్ తారాగణం
ఆంటోనీ మెకీ, అయేషా హర్ట్, షార్ట్‌లో కాప్లే, ఘసాన్ మసౌద్, సామీ బౌజాలియా, లామిస్ అమర్, నుమాన్ అకర్ తదితరులు ఈ డెజర్ట్ వారియర్‌లో నటించగా.. రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించారు. డేవిడ్ సెల్ప్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, స్టోరీ అందించారు. గులార్మో గర్జా సినిమాటోగ్రాఫర్‌గా, రిచర్డ్ మెట్లర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. డాన్ లెవి సంగీతం అందించారు.

Recommended For You
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

డెజర్ట్ వారియర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ వ్యయం, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి డెజర్ట్ వారియర్ మూవీని 150 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 1417 కోట్ల రూపాయలు) బడ్జెట్‌తో నిర్మించారు. హాలీవుడ్ స్థాయి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. దాదాపు 500 వందల మందికి పైగా సిబ్బంది ప్రతిరోజూ షూటింగ్ చేయడం, భారీ పారితోషికాలు, షూటింగ్ ఆలస్యం తదితర కారణాలతో బడ్జెట్ ఊహించని విధంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే రెండేళ్లు పట్టిందంటే ఏ స్థాయిలో ఆలస్యం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

You May Also Like
'నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’
'నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’

డెజర్ట్ వారియర్‌కు డిజాస్టర్ టాక్
ఈ సినిమాను అమెరికాలో వెర్టికల్ సంస్థ రిలీజ్ చేయగా.. సౌదీ అరేబియాలో ఎంపైర్ ఎంటర్‌టైన్‌మెంట్ పంపిణీ చేసింది. తొలుత గతేడాది సెప్టెంబర్ 28న జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాను పంపిణీ చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్ 24న అమెరికాలో రిలీజ్ అయ్యింది డెజర్ట్ వారియర్. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసి.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. బేబీ బంప్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. బేబీ బంప్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్

డెజర్ట్ వారియర్ కలెక్షన్స్
అక్కడ దాదాపు 1000 థియేటర్‌లలో విడుదలై ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 4,72,000 డాలర్లు (4.46 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. సౌదీ అరేబియాలోనూ డెజర్ట్ వారియర్ ఘోరంగా విఫలమైంది. తొలి వారం సౌదీలో 87 వేల డాలర్లు (82.21 లక్షల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 6,65,000 డాలర్లు (దాదాపు 6 కోట్ల రూపాయలు) మాత్రమే రాబట్టి దాదాపు 1400 కోట్లకు పైగా నష్టంతో ప్రపంచ సినీ చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది డెజర్ట్ వారియర్. ఈ పరిణామంతో సౌదీ చిత్ర పరిశ్రమపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X