800 బడ్జెట్.. 3000 కోట్ల కలెక్షన్లు.. వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మూవీ ఎంటో తెలుసా?
హాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్, ఇల్యూమినేషన్ బ్యానర్లపై క్రిస్ రెనౌడ్ దర్శకత్వంలో క్రిస్ మెలెడాడ్రీ నిర్మించిన చిత్రం డిస్సీకెపబుల్ మీ 4. అమెరికన్ యానిమేటెడ్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5వ తేదీన రిలీజైంది. ఈ చిత్రంలోని యానిమేషన్ పాత్రలకు స్టీవ్ క రెల్, క్రిస్టీన్ విగ్, పీయరే కాఫిన్, జో కింగ్, మిరాండా, స్టీవ్ కూగన్ తదితరులు భాగమయ్యారు. ఈ సినిమా గత మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డెస్పికెబుల్ మీ 4 సినిమా విషయానికి వస్తే.. అత్యాధునిక యానిమేషన్ సాంకేతికతతో రూపొందించడంతో భారీగానే కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇక హాలీవుడ్ స్టార్స్ అందరూ ఈ మూవీకి డబ్బింగ్ చెప్పడంతో ఖర్చు భారీగానే అయింది. ఈ సినిమా సుమారుగా 100 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 830 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో రూపంించారు. ఈ సినిమా దాదాపు ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో రిలీజ్ చేశారు.

ఇక ఇండియాలో కల్కి ప్రభంజనం కొనసాగుతుండటంతో పెద్దగా వసూళ్లు నమోదు కాలేదు. తొలి రోజు ఇంగ్లీష్ వెర్షన్ 1.1 కోట్లు, హిందీ వెర్షన్ 50 లక్షల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. మొత్తంగా తొలి రోజు 1.5 కోట్ల రూపాయల వసూళ్లు కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు ఇంగ్లీష్ వెర్షన్ 2.35 కోట్లు, హిందీ వెర్షన్ 35 లక్షలు, తమిళంలో 15 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు 3.50 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఇండియాను మినహాయిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో 122 మిలియన్లు అంటే భారతీయ కరెన్సీలో 1020 కోట్లు, ఇతర దేశాల్లో మరో 229 మిలియన్లు అంటే.. 1900 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా సమారుగా 3000 కోట్ల వసూళ్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











