Deva Day 2 Collections: షాహిద్ ‘దేవా’కు డీసెంట్ కలెక్షన్లు.. పూజా హెగ్డే మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్లపై సిద్దార్త్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం దేవా. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, పూజా హెగ్డే జంటగా నటించారు. పవైల్ గులాటీ, పర్వేష్ రానా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జనవరి 31వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్, వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దేవా మూవీ కథ విషయానికి వస్తే.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరి. ఓ కీలకమైన కేసు దర్యాప్తులో భాగంగా మిస్టరీని ఛేధించే క్రమంలో యాక్సిడెంట్‌కు గురైన దేవా (షాహిద్ కపూర్) గతాన్ని మరిచిపోతాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు ఎలా జరిగింది? తన ప్రియురాలు, జర్నలిస్టు (పూజా హెగ్డే) ఏ విధంగా దేవాకు సహాయం చేసింది. కేసు మిస్టరీ ఎలా వీడింది అనేది ఈ సినిమా కథ.

Deva Day 2 Expected Box Office Collections Worldwide Pooja Hegde Movie decent start at GBOC

ముంబై నేపథ్యంగా సాగే దేవా సినిమాను భారీగా, రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను జీ స్టూడియో సొంతంగా రిలీజ్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 60 కోట్ల షేర్, 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

దేవా సినిమాకు క్రేజ్‌ ఎక్కువగా ఉండటంతో ఇండియాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేశారు. షాహిద్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను ఇండియాలో 4500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 1500 స్క్రీన్లలో విడుదల చేశారు. దాంతో ఈ సినిమా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రిలీజైన ప్రధాన సెంటర్లలో ఈ చిత్రం సుమారుగా 35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

Deva Day 2 Expected Box Office Collections Worldwide Pooja Hegde Movie decent start at GBOC

దేవా సినిమా తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజున 5.5 కోట్ల రూపాయలు ఇండియాలో, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇండియాలో మరో 5 నుంచి 6 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను, ప్రపంచవ్యాప్తంగా 6 నుంచి 7 కోట్ల మధ్య కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: deva shahid kapoor pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X