twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవదాస్‌ కలెక్షన్లపై దెబ్బపై దెబ్బ.. డిస్టిబ్యూటర్లకు భారీగా.. ఎన్ని కోట్ల నష్టమంటే!

    |

    అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో వచ్చిన దేవదాస్ భారీ అంచనాలతో రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికి తొలివారాంతంలో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా, విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం విడుదలై మరింత దెబ్బ కొట్టింది. గత 11 రోజుల్లో మెరుగైన వసూళ్లు రాబట్టినప్పటికి ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    'దేవదాస్' మూవీ డిలీటెడ్ సీన్: నాని పెర్ఫార్మెన్స్ చూస్తే షాకవ్వాల్సిందే!'దేవదాస్' మూవీ డిలీటెడ్ సీన్: నాని పెర్ఫార్మెన్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

     దేవదాస్‌ సినిమాపై నోటా దెబ్బ

    దేవదాస్‌ సినిమాపై నోటా దెబ్బ

    ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం దేవదాస్ చిత్రం తొలివారంలో అంటే 8 రోజులకు రూ.39.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత నోటా రిలీజ్ కావడంతో బలవంతంగా దేవదాస్ చిత్రాన్ని థియేటర్ల నుంచి ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో భారీగా కలెక్షన్లు క్షీణించాయి.

    11 రోజుల్లో వసూళ్లు ఇలా

    11 రోజుల్లో వసూళ్లు ఇలా

    నోటా ప్రభావంతో దావదాస్ చిత్రం రెండవ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.5.60 కోట్ల వసూళ్లను రాబట్టింది. చివరికి 11 రోజుల్లో రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవరాల్‌గా డిస్టిబ్యూటర్ల పెట్టుబడిలో కేవలం 64 శాతం వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.

    Recommended Video

    Devadas Movie Success Meet | Nani | Nagarjuna | Rashmika Mandanna | Filmibeat Telugu
    ఇంకా 14 కోట్లు రావాల్సిందే

    ఇంకా 14 కోట్లు రావాల్సిందే

    దేవదాస్ సినిమా థియేట్రికల్ డిస్టిబ్యూషన్ రైట్స్‌ను రూ.38 కోట్లకు అమ్మడం జరిగింది. ఇప్పటి వరకు ఈ చిత్రం సుమారు రూ.24 కోట్ల నికర వసూళ్లను సాధించింది. అంటే ఇంకా డిస్ట్రిబూటర్లకు దాదాపు 14 కోట్లు రావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అరవింద సమేత అక్టోబర్ 11న రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నది.

     నష్టం రూ.10 కోట్లు?

    నష్టం రూ.10 కోట్లు?

    ఇక అరవింద సమేత రిలీజ్ అయితే ఇంకా దేవదాస్ పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయం. అరవింద సమేత చిత్రం అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దేవదాస్ చిత్రాన్ని ఎత్తివేయక తప్పదు. మరో కొన్ని రోజులు ఆడితే కనీసం నాలుగు వచ్చినా.. ఇంకా రూ.10 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం కనపడతున్నది.

    English summary
    Akkineni Nagarjuna and Nani's Devadas has collected Rs 5.60 crore gross at the worldwide box office in 2nd weekend and its 11-day total collection stands at Rs 45 crore gross in the global market. Devadas has received 63.42 percent of the investment of its distributors and the movie is yet to recover Rs 13.90 crore
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X