‘దేవదాస్’ ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీసు వద్ద సత్తా చాటిన నాగార్జున-నాని కాంబో!

నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాస్' చిత్రం గురువారం విడుదలై బాక్సాఫీసు వద్ద తొలిరోజు డీసెంట్ కలెక్షన్ సాధించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన నాగార్జున, నాని గత సినిమాలను మించిన ఓపెనింగ్స్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగార్జున, నాని కలిసి తొలిసారి కలిసి నటించిన సినిమా కావడంతో ముందు నుండీ ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా ఆసక్తికరంగా నిర్వహించడం అందరినలోనూ ఈ మల్టీస్టారర్ మీద ఆసక్తి పెరిగింది. ఇదే సినిమాకు మంచి ఓపెనింగ్స్ సాధించి పెట్టడానికి కారణమైంది.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

కలిసొచ్చిన భారీ రిలీజ్

కలిసొచ్చిన భారీ రిలీజ్

నాగార్జున, నాని కలిసి నటించిన చిత్రం కావడంతో థియేట్రికల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయనే టాక్ నడుస్తోంది.

తొలి రోజు ఎంత వసూలైంది?

తొలి రోజు ఎంత వసూలైంది?

నిర్మాతలు ఈ చిత్రానికి తొలి రోజు ఎంత వసూలైంది? అనే విషయాలు అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.54 కోట్లు వసూలైనట్లు సమాచారం.

నాని గత సినిమా రికార్డులు బద్దలు

నాని గత సినిమా రికార్డులు బద్దలు

నాని ఇంతకు ముందు నటించిన సినిమాల రికార్డులన్నింటినీ ‘దేవదాస్' మూవీ బద్దలు కొట్టింది. నాని గత చిత్రాలు నిన్ను కోరి (రూ. 10.20 కోట్ల గ్రాస్), నేను లోకల్ (రూ. 9.70 కోట్లు), కృష్ణార్జున యుద్ధం (రూ. 9.5 కోట్లు) చిత్రాలను ‘దేవదాస్' రూ. 11.54 కోట్లతో అధిగమించి ‘ఎంసీఏ' (రూ. 15.50 కోట్లు) తర్వాతి స్థానంలో నిలిచింది.

ఎంతకు అమ్మారు?

ఎంతకు అమ్మారు?

నాగార్జున, నాని... ఇద్దరు స్టార్స్ నటించిన చిత్రం కావడంతో ‘దేవదాస్' థియేట్రికల్ రైట్స్ రూ. 38 కోట్లకు అమ్ముడయ్యాయి. తొలి రోజు రూ. 6.75 కోట్ల షేర్(రూ. 11.54 కోట్ల గ్రాస్) వసూలు చేయడం ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 18 శాతం మేర పెట్టుబడి రికవరీ అయింది. అయితే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి భారీ వసూళ్లు ఖాయం అంటున్నారు.

 ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్

ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్

నైజాం ఏరియాలో రూ. 1. 45 కోట్లు, సీడెడ్ రూ. 73 లక్షలు, వైజాగ్ రూ. 58 లక్షలు, ఈస్ట్ రూ. 39 లక్షలు, వెస్ట్ రూ. 26 లక్షలు, కృష్ణ రూ. 33 లక్షలు, గుంటూరు 53 లక్షలు, నెల్లూరు రూ. 19 లక్షలు, కర్నాటక రూ. 1.20 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 24 లక్షలు, ఓవర్సీస్ రూ. 75 లక్షలు.... ఓవరాల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ. 6.75 కోట్ల షేర్ వసూలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X