Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
‘దేవదాస్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.... లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉందా?
నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ 'దేవదాస్' బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్ సాధిస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో ఫస్ట్ వీకెండ్(4 రోజులు) పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్కు ఒక రోజు ఎక్స్ట్రా కలిసొచ్చినా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. అలా అని మరీ డీలా పడిపోలేదు. మీడియం రేంజిలో వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. నాగార్జున, నాని ఇద్దరు పెద్ద స్టార్స్ నటించిన సినిమా కావడంతో సినిమాకు కాస్త యావరేజ్ టాక్ ఉన్నా ఆశాజనకమైన ఫలితాలు సాధిస్తోంది.
నాలుగు రోజుల్లో ఎంత వసూలైంది?
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.77 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. అత్యధికంగా నైజాం ఏరియాలో రూ. 4.45 కోట్ల షేర్ రాబట్టింది.
ఎంతకు అమ్మారు?
నాగార్జున, నాని నటించిన సినిమా కావడంతో ‘దేవదాస్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగ అన్ని ఏరియాలు కలిపి రూ. 38 కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి. ఫస్ట్ వీకెండ్ రూ. 16.77 కోట్ల షేర్ వసూలైంది.
లాభాలు రావాలంటే ఇంకా ఎంత?
‘దేవదాస్' మూవీ లాభాల బాటలోకి వెళ్లాలంటే..... దాదాపు రూ. 22 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పటి వరకు రూ. 16.77 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓ వైపు యావరేజ్ టాక్తో రన్ అవుతుండటం, వచ్చే వారం ‘నోటా' విడుదల ఉన్న నేపథ్యంలో రూ. 22 కోట్లు రాబడుతుందా? అనే సందేహం ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.
ఏరియా వైజ్ కలెక్షన్స్
తొలి 4 రోజుల్లో ఏరియా వైజ్ వసూలైన షేర్ వివరాలు పరిశీలిస్తే... నైజాం రూ. 4.45 కోట్లు, సీడెడ్ రూ. 1.75 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.57 కోట్లు, గుంటూరు రూ. 1.13 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 84 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 63 లక్షలు, కృష్ణా రూ. 92 లక్షలు, నెల్లూరు రూ. 43 లక్షలు, రెస్టాఫ్ ఇండియా కర్నాటకతో కలిపి రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.90 కోట్లు వసూలైంది.