Devagudi Box Office Collections: డీసెంట్‌గా దేవగుడి కలెక్షన్లు.. ఫ్యాక్షన్ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమిటంటే?

గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దేవగుడి. రాయలసీమ ఫ్యాక్షన్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు బెల్లం రామకృష్ణారెడ్డి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు వహించడమే కాకుండా నిర్మాతగా మారి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రంలో అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ కీలక పాత్రలు పోషించగా.. అన్నపూర్ణమ్మ, రాకెట్ రాఘవ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ముఖ్య పాత్రలు పోషించారు.

బెల్లం సుధారెడ్డి సమర్ఫణలో రూపొందిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: లక్ష్మీకాంత్ కనికే, మ్యూజిక్: మదీన్ ఎస్‌కే, ఎడిటర్: నాగిరెడ్డి వీ, ఫైట్స్: స్టంట్ శివ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రవీణ్ రెడ్డి అబ్బవరం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జనవరి 30వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా పలు ప్రాంతాల్లో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వాల్యూ ఎంత? గత 3 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Devagudi 3 Days Estimated Box Office

తెలుగు నేటివిటీతో రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త, సీనియర్ నటులతో రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రియల్ లోకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమాను రాజీ లేకుండా క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 5 కోట్ల రూపాయలు మేర అయింది. ఈ సినిమాను బెల్లం రామకృష్ణారెడ్డి సొంతంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ వాల్యూ సుమారుగా 3 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దేవగుడి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 150 సెంటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి రోజున డీసెంట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం తొలి రోజు 25 లక్షల రూపాయలను, రెండో రోజు 20 లక్షల రూపాయలను, మూడో రోజు ఈ సినిమా 25 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో గత మూడు రోజుల్లో 70 లక్షల రూపాయలను ఆంధ్రా, నైజాంలో రాబట్టింది. ఈ సినిమా స్టడీగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ సంబరాలను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్, పాటల చిత్రీకరణ బాగుంది. రఘు కుంచె పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కొత్తవారైన అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ మంచిగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ మాకు సంతోషాన్ని కలుగు జేసింది అని అన్నారు. నటుడు రఘుకుంచె మాట్లాడుతూ - మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా చిన్న సినిమాను కూడా ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ "దేవగుడి" విజయంతో మరోసారి ప్రూవ్ చేశారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X