దేవర ఫేక్ కలెక్షన్లా? ఎన్టీఆర్ రికార్డును తట్టుకోలేక పోతున్న ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్!
తెలుగు సినిమా నుంచి మళ్ళీ చాలా రోజుల తర్వాత భారీ అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం "దేవర" అనే చెప్పాలి. కాగా ఈ భారీ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చింది. అయితే ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ఎంతో స్పెషల్ గా తీసుకొని భారీ ఎత్తున పాన్ ఇండియా భాషల్లో ప్రమోషన్స్ ని కూడా నిర్విరామంగా చేసాడు.
ఇలా తారక్ తన నుంచి కావలసిన అంతా సినిమా కోసం పెట్టేసాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మొదటి రోజు వసూళ్లు రావడం నుంచి అసలు రచ్చ మొదలైంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 170 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోవడం అనేది ఆశ్చర్యంగా మారింది.

కాగా దీనికంటే భారీ సినిమాలు అది కూడా ఓవర్సీస్ మార్కెట్ లో స్ట్రాంగ్ జోన్ ఉన్న హీరోల సినిమాలకి ధీటుగా దేవర డే 1 వసూళ్లు రావడం అనేది ఆ హీరోల ఫ్యాన్స్ కి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. మరి ఇలా చూసుకున్నట్టయితే దేవర వసూళ్లపై ఇండియాస్ బిగ్ స్టార్స్ ప్రభాస్ అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు అనుమానం, ఆశ్చర్యం రెండూ వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ నటించిన లాస్ట్ చిత్రం కల్కి 2898 ఎడి డే 1 కి ఇండియా వైడ్ గా భారీ లెవెల్లో 1.22 మిలియన్ కి పైగా టికెట్ బుకింగ్స్ ని జరుపుకుంది. అంటే మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా 12 లక్షలకి పైగా టికెట్ సేల్స్ బుక్ మై షోలో జరిగాయి. అలాగే షారుఖ్ ఖాన్ నటించిన లాస్ట్ భారీ హిట్ చిత్రం "జవాన్" కూడా డే 1 కి ఇంచు మించు కల్కి తో సమానంగా 1.2 మిలియన్ మేర బుకింగ్స్ జరుపుకుంది.
కానీ దేవర మాత్రం ఈ రెండు సినిమాల్లో కేవలం సగం అంటే 6 లక్షల టికెట్ సేల్స్ ని మొదటి రోజు జరుపుకుంది. కాగా ఇక్కడే ఇంత తేడా ఉన్నపుడు ఆ రెండు సినిమాలకి దగ్గర వసూళ్లు దేవర కి ఎలా నమోదు అయ్యాయని ప్రభాస్ అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పోనీ ఓవర్సీస్ వసూళ్లయినా జవాన్, కల్కి కంటే ఎక్కువ వచ్చేసాయా? అంటే అది కూడా కాదు..

అయినప్పటికి దేవర 172 కోట్లు చేసింది అంటే అస్సలు నమ్మబుద్ది కావడం లేదు. దీనితో దేవర డే 1 వసూళ్లు మాత్రం ఖచ్చితంగా ఫేక్ అని ప్రభాస్, షారుఖ్ ఖాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. పోనీ ఎంత తెలుగు స్టేట్స్ లో భారీ వసూళ్లు వచ్చినప్పటికీ కల్కి కి దగ్గరలోనే చాలా చోట్ల దేవర ఆగింది. కొన్ని చోట్ల అయితే నాన్ RRR రికార్డులు సెట్ చేసింది.
ఇలా చూసుకున్నా హిందీలో దేవర కంటే కల్కి ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా చాలా లాజిక్స్ చూసుకున్నప్పటికీ దేవర కి ఇంత రేంజ్ వసూళ్లు వచ్చే ఛాన్స్ లేదని వారు అంటున్నారు. అలాగే ట్రేడ్ పండితులు కూడా దేవర డే 1 కి దాదాపు 150 కోట్ల లోపే అంచనా వేశారు. కానీ మేకర్స్ 172 కోట్లు అనౌన్స్ చేయడం అయితే ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తుంది. మరి అనవసర ఆర్భాటానికి పోయి ఇలా చేస్తున్నారో లేక నిజంగా దేవరకి ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయో లేదో వారికే తెలియాలి.


Click it and Unblock the Notifications











