Devara Advance Boooking: దేవర అడ్వాన్స్ బుకింగ్ రికార్డు.. కల్కిని బీట్ చేసిన ఎన్టీఆర్ మూవీ

NTR Devara Movie Pre Sale Business Details: గ్లోబల్ స్టార్, మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను 2 పార్ట్ గా తెరక్కెకిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ చాలా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్- కొరటాల కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ఓవర్సిస్‌లో అడ్వాన్స్ బుక్సింగ్ పరంగా దూసుకపోతుందట. ఈ తరుణంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ ను బీట్ చేసి రికార్డు క్రియేట్ చేసిందట. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ? మీరు కూడా ఓ లూక్కేయండి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్, పోస్టర్స్, గ్లిప్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీ పాటలకు విపరీతమైన ఆదరణ వస్తుంది. ఇప్పటికి కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ లిస్ట్ లో నిలిచాయి. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్‌ డ్యూయల్ రోల్ లో నటించనున్నారని మూవీ టీం ప్రకటించడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఇలా వరుసగా క్రేజీ క్రేజీ అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీపై బజ్‌ క్రియేట్ చేస్తున్నారు.ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానున్నది. అంటే.. సినిమా విడుదలకు ఇంకా 18 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ప్రారంభమయ్యాయి. బుకింగ్ ఓపెన్ చేస్తున్నారో లేదో క్షణాల్లో టికెట్స్‌ భారీగా అమ్ముడుపోయాయి.
ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్‌ఫుల్‌ బోర్డు కూడా పెట్టాశారు.

Devara Advance Boooking Collections in North America NTR movie beats Kalki collections

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఓవర్సిస్‌లోనూ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ప్రారంభమయ్యాయి. బుకింగ్ ఓపెన్ చేస్తున్నారో లేదో క్షణాల్లో టికెట్స్‌ అమ్ముడుపోయాయి. దాదాపు నెల ముందు నుంచే ప్రీ సేల్స్‌ ప్రారంభమైందంటే.. ఓవర్సిస్ లో దేవర క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థమవుతుంది. యూఎస్‌లో దేవర ప్రీమియర్ ప్రీ-సేల్స్ జినెస్‌ చూస్తే.. ఉత్తర అమెరికా 628 షోలకు అడ్వాన్స్ గా టిక్కెట్స్ అమ్ముడుపోగా.. 452K డాలర్ల బిజిసెన్ జరిగింది.

యూఎస్ఏలో 217 లోకేషన్స్లో607 షోలకు గాను 13677 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అలా అక్కడ 415,270 డాలర్ల బిజిసెస్ జరిగింది. కెనడా లో కూడా అడ్వాన్స్ బుక్సింగ్ చాలా జోరుగా సాగుతున్నాయి. 5 లోకేషన్స్ లో 21షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా 1191 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ఇక్కడ 37,568 డాలర్ల బిజిసెస్ జరిగింది. ఇక ప్రీమియర్స్ కు 18 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతూ.. ప్రభాస్ కల్కి సినిమా రికార్డు బ్రేక్‌ చేసింది.

Devara Advance Boooking Collections in North America NTR movie beats Kalki collections

ఇదెలా విడుదలైన దావూదీ(Daavudi Video Song)వీడియో సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ సంచలన రెస్పాన్స్ తో 24 గంటల్లో 21 మిలియన్ వ్యూస్ మార్క్ దాటింది. లైక్స్ పరంగా దాదాపు 500K లైక్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇలా ఓవర్సిస్‌లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ పరంగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి రికార్డు బీట్ చేయడం, సాంగ్స్ కు భారీ రెస్పాస్స్ రావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 'ఆర్ఆర్ఆర్' తరువాత ఆ రేంజ్ లో భారీ హిట్ మూవీగా 'దేవర'మారబోతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Read more about: devara ntr kalki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X