Devara Advance Booking: దేవర రికార్డు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు.. ప్రభాస్ రికార్డు బీట్ చేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ పరంగా మైలురాయిని అధిగమించింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మిస్తున్న చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, అలాగే సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 160 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు సమాచారం. ఇక ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ 165 కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దేవర టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు విశేషంగా ఆదరణ లభించడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే అభిమానుల్లో, సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నెల రోజుల కిందటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, అమెరికా, కెనడాలో ప్రారంభం కాగా మంచి స్పందన కనిపించింది.
ముంబైలో ఇటీవల జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు ముందే దేవర చిత్రం నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లు అంటే 8.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఏమిటో చెప్పకనే చెప్పాయి.

ఇదిలా ఉండగా, కెనడా, అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌కు విశేష ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రం రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు ఉండగానే 2 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఎన్టీఆర్ కెరీర్‌లో నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, RRR తర్వాత రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసిన నాలుగో చిత్రంగా దేవర ఘనతను సాధించింది.
ఇదిలా ఉండగా, రిలీజ్‌కు ముందే రెండు మిలియన్ డాలర్లు సాధించే విషయంలో ప్రభాస్‌తో ఎన్టీఆర్ పోటీ పడుతున్నారు. కల్కి చిత్రం, సలార్ అడ్వాన్స్ బుకింగ్ కంటే ఈ సినిమాకు ఎక్కువగా రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఓవర్సీస్‌లో దేవర చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











