Peddi Vs Devara: దేవర కలెక్షన్లు అంతా ఫేకా? నందమూరి, మెగా ఫ్యాన్స్ బాక్సాఫీస్ వార్!

పెద్ది సినిమా రిలీజ్ తర్వాత నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య బాక్సాఫీస్ కలెక్షన్ల వార్ మొదలైంది. పెద్ది సినిమా విడుదల తర్వాత నందమూరి ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో మెగా ఫ్యాన్స్ కూడా ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో యాక్టివ్ అయ్యారు. దాంతో గత కొద్దికాలంగా ఈ రెండు గ్రూపుల మధ్య ఫ్యాన్ వార్ హోరాహోరీగా నడుస్తున్నది.

మెగా హీరోలపై నందమూరి ఫ్యాన్స్ కౌంటర్ వేస్తే.. అదే స్థాయిలో నందమూరి ఫ్యాన్స్‌పై మెగా హీరోలు విరుచుకు పడుతున్నారు. ముఖ్యంగా పెద్ది సినిమా కలెక్షన్లపై ఫోకస్ పెట్టిన నందమూరి ఫ్యాన్స్‌కు దేవర కలెక్షన్లు ఫేక్ అని నిరూపించడానికి మెగా అభిమానులు సాక్ష్యాలతో సహా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేవర, పెద్ది కలెక్షన్ల యుద్దం సోషల్ మీడియాలో ఎలా జరుగుతున్నదంటే?

Devara Vs Peddi Box Office

దేవర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత నాగవంశీ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర కలెక్షన్ల గురించి ప్రస్తావించారు. దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్లు జెన్యూన్ కాదు. ఫ్యాన్స్ కోసం కొన్ని లెక్కలు చెబుతాం. వాళ్ల సంతోషం కోసం మేము ఓ ఫిగర్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆనందం కోసమే అలాంటి నంబర్లు బయటపెడుతాం. అసలు ఎంత వచ్చిందో మాకు మాత్రమే తెలుసు అని అన్నారు. దాంతో దేవర సినిమా వెల్లడించిన వసూళ్లలో కొంత మేరకు ఫేక్ అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోను షేర్ చేస్తూ మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

ఇక దేవర చిత్రం టోటల్ థియేట్రికల్ రన్‌లో సుమారుగా 4.8 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా సుమారుగా 500 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి అని పోస్టర్ వేశారు. అయితే నమోదైన ఫుట్‌ఫాల్స్ ప్రకారం..ప్రకటించిన వసూళ్లతో తేడా ఉంది. టికెట్ అమ్మకాలను యావరేజ్ ధరతో లెక్కించినా ఆ నంబర్లు మ్యాచ్ కావడం లేదనే విషయాన్ని ఆధారాలతో మెగా ఫ్యాన్స్ బయటపెడుతున్నారు.

ఇక పెద్ది సినిమాకు సంబంధించిన తొలివారాంతమే 3 మిలియన్ టికెట్లు బుక్‌మై షోలో అమ్ముడయ్యాయి. ఇటీవల కాలంలో ఇదోక రికార్డు అని సాక్ నిక్ తెలిపింది. ఇంకా డిస్ట్రిక్ట్ యాప్, పేటీఎం, ఇతర ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్స్ ద్వారా ఈ చిత్రం సుమారుగా 6 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయని మెగా ఫ్యాన్స్ ఓ డేటాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ సినిమాకు 390 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి అని తెలిపారు. 6.65 మిలియన్లకు 390 కోట్లు వస్తే.. 4.8 మిలియన్ టికెట్లుకు 500 కోట్లకుపైగా ఎలా వస్తాయని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల కాలంలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ గట్టిగానే కొనసాగుతున్నది. గతంలో ఇలాంటి ఫ్యాన్ వార్ తమిళ సినిమా పరిశ్రమలో కనిపించేది. అలాంటి సోషల్ మీడియా యుద్దాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు కూడా పాకాయి. RRR సినిమా తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య భారీగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ జెన్యూన్ కలెక్షన్లు బయటపెట్టి ఇలాంటి వివాదాలకు తెర దించుతారా? చూడాల్సిందే.

Read more about: devara peddi box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X