Devara RTC X Road Collections: ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దేవర హంగామా.. మహేష్, ప్రభాస్‌కు మించి ఎన్టీఆర్ వసూళ్లు

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. సోమవారం రోజున ఈ సినిమా ప్రీ సేల్స్ ఓపెన్‌ కాగా అన్ని చోట్ల రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే ఈ చిత్రం తెలుగు టాప్ హీరోలను మించి బాక్సాఫీస్ నంబర్లను నమోదు చేస్తున్నది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ గురించిన వివరాల్లోకి వెళితే..

RRR మూవీ మినహాయిస్తే.. యంగ్ టైగర్ నటించిన మూవీ 6 ఏళ్ల తర్వాత సోలోగా రిలీజ్ అవుతున్నది. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టీజర్ నుంచి ట్రైలర్స్ వరకు ఏదో ఓక రకంగా బజ్ క్రియేట్ చేసింది. దాంతో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే మంచి స్పందన లభిస్తున్నది.

Devara Day 1 Advance Booking Collections in Hyderabad s RTC X Road Jr NTR surpasses Prabhas and Maheshbabu

తెలుగు సినిమాకు రాజధానిగా భావించే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కలెక్షన్లపై అందరి దృష్టి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు ఇక్కడ చేసే హంగామా గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏం జరుగుతుందనే విషయంపై చర్చించుకొంటారు. అలాంటి క్రేజ్ ఉన్న ప్రాంతంలో దేవర రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు చేస్తున్నది.

హైదరాబాద్‌లోని ఈ సెంటర్‌లో గతంలో అత్యధికంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సుమారుగా 90 లక్షలు రాబట్టింది. RRR 76 లక్షలు, కల్కి 75 లక్షలు, ఆదిపురుష్ 58 లక్షలుె, సర్కారు వారీ పాట 58 లక్షలు, కేజీఎఫ్ 2 50 లక్షలు, సలార్ 50 లక్షలు వసూలు చేసింది.

Devara Day 1 Advance Booking Collections in Hyderabad s RTC X Road Jr NTR surpasses Prabhas and Maheshbabu

దేవర విషయానికి వస్తే.. ఈ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనే నాలుగైదు థియేటర్లలో 46 షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ మూవీకి పూర్తిస్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాకపోయినప్పటికీ.. రికార్డు స్థాయి వసూళ్లు తొలి రోజు నమోదు అయ్యాయి. ఈ సినిమా డే 1 రోజున 1.32 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌లో 38.5 లక్షలు, సంధ్య 35లో 26.8 లక్షలు, దేవీలో 32.2 లక్షలు, సంధ్య 70 ఎంఎంలో 33.3 లక్షలు, శాంతిలో 24.6 లక్షలు, తారకరామలో 1.55 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆచార్య మూవీ తర్వాత దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కల్యాణ్ రామ్ నిర్మించారు. ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ తొలిసారి నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఈ క్రమంలో ఈ సినిమా సెప్టెంబర్ 27 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 30 కోట్ల రూపాయల మేర కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Read more about: devara jr ntr janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X