Devara: జపాన్‌లో దేవర కలెక్షన్లు.. రామ్‌చరణ్ రికార్డును కొట్టలేపోయిన ఎన్టీఆర్!

ఇప్పుడు అనేకమంది తెలుగు సినిమాకి చెందిన హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లో కన్నేస్తున్నారు కానీ ఇక్కడ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మెప్పు పొందిన అతి కొద్ది మంది హీరోస్ లో మాత్రం జక్కన్న రాజమౌళి చెక్కిన శిల్పాలు తప్పకుండా ఉంటాయి అని చెప్పాలి. రాజమౌళి వర్క్ చేసిన టాప్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అలానే రామ్ చరణ్ లతో గ్లోబల్ వైడ్ గా ఇపుడు ఫేమ్ ఉంది.

కాగా ఈ హీరోస్ కి మెయిన్ గా జపాన్ దేశంలో అయితే మరింత లెవెల్లో ఉందని చెప్పవచ్చు. ఈ ముగ్గురు హీరోస్ లో ఎవరి సినిమా వచ్చినా కూడా జపాన్ అభిమానులు బాగా ఆదరిస్తారు. కాగా మన దగ్గర ఆడియెన్స్ సినిమాలు గట్టిగానే చూస్తారు కానీ జపాన్ లో ఆడియెన్స్ మాత్రం తమకి ఓ సినిమా నచ్చింది అంటే దానిని ఒక ఉద్యమంలా చూస్తారని చెప్పడానికి నిదర్శనం RRR.

devara day 1 collections in Japan

RRR సినిమా అక్కడ ఏకంగా 365 రోజులకి పైగా ఆడటమే కాకుండా ఫారిన్ నుంచి వచ్చిన ఏ సినిమా కంటే అత్యధిక వసూళ్లు ఈ చిత్రం అందుకొని సంచలనం సెట్ చేసింది. ఇలా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ ఉన్న సినిమా అక్కడ మంచి ట్రీట్ ఇస్తే.. వీరి నుంచి సెపరేట్ గా వెళ్లిన సినిమాలు లెక్కలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు.

RRR తర్వాత రామ్ చరణ్ నుంచి రంగస్థలం సినిమా అక్కడ రిలీజ్ అయితే అక్కడ మొదటి రోజు KGF 1, 2 సినిమాలు పోటీతో రిలీజ్ అయ్యి రికార్డు నంబర్స్ ఓపెనింగ్స్ అందుకుంది. కాగా రంగస్థలం 2.5 మిలియన్ జపాన్ యిన్స్ వసూలు చేసి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఇదంతా ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేకుండానే రామ్ చరణ్ సెట్ చేసిన రికార్డు.

ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ నుంచి దేవర సినిమా అది కూడా RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన భారీ చిత్రం ఇది అంతేనా నెల రోజులు ముందు నుంచే జపాన్లో మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అంతే కాకుండా స్వయంగా ఎన్టీఆర్ కూడా కొన్ని రోజులు ముందే వెళ్లి మరీ ప్రమోట్ చేసుకున్నారు. ఇంత చేసినా కూడా దేవర సినిమా 1.2 మిలియన్ యెన్స్ మాత్రమే అందుకున్నట్టుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

దీనితో జపాన్ లో ఓపెనింగ్స్ పరంగా మాత్రం చిట్టిబాబుని దేవర అందుకోలేకపోయాడనే చెప్పవచ్చు. దీనితో జపాన్లో రామ్ చరణ్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజుకి కూడా జపాన్ లో అభిమానులు తన బర్త్ డేని ఎంతో ప్రేమగా కూడా జరిపారు. అంతే కాకుండా రామ్ చరణ్ రీసెంట్ డిజాస్టర్ సినిమా "గేమ్ ఛేంజర్" సినిమాని రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ప్లాప్ సినిమా అక్కడ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: jr ntr devara rangasthalam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X