Devara 10 days Collections: దేవర 10వ రోజు కలెక్షన్ల సంచలనం... ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా లాభాలను కూడా డిస్టిబ్యూటర్లకు పంచి పెడుతున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తొలి రోజు మిక్స్‌డ్ టాక్ సాధించినా.. ఆ తర్వాత దానిిన అధిగమించి... పాజిటివ్‌గా మలుచుకొన్నది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యువ సుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నందమూరి నిర్మించారు. ఈ సినిమా గత 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
దేవర సినిమాకు క్రేజ్ భారీగా ఉండటంతో బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమాకు 182 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. సుమారుగా 184 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా 9వ రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధించింది.

దేవర చిత్రం 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 4.3 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద స్పష్టమైంది. దాంతో ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో 130 కోట్ల షేర్, 183 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత 9 రోజుల దేవర కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 53 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 24.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 11 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 5.35 కోట్లు వసూలు చేసింది.

ఇక దేవర చిత్రం కన్నడలో 30 కోట్ల రూపాయలు, తమిళంలో 10 కోట్ల రూపాయలు, మలయాళంలో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో ఈ చిత్రం 51 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక నార్త్‌లో ఇతర భాషలకు సంబంధించి 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగేతర రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా 10వ రోజు కూడా స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ సినిమా తెలుగులో 5.5 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్లు కలిపి మొత్తం 11 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 17 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకుపైగా లాభాన్ని పంచిపెట్టింది.


Click it and Unblock the Notifications











