Devara 11 days Collections: దేవరకు 400 కోట్లు.. 11వ రోజు కూడా కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పడిస్తున్నది. జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా 10 రోజుల తర్వాత అదే జోష్ కనిపిస్తున్నది. కొరటాల శివకు తప్పనిసరి పరిస్థితుల్లో హిట్ అందించడంతో ఊరట కలిగించింది. ఈ సినిమా 11వ రోజుల్లో ఎంత వసూలు చేసింది. ఏ మేరకు లాభాలను సాధించిపెట్టిందనే విషయాల్లోకి వెళితే..
దేవర చిత్రం 10వ రోజున దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం తెలుగులో 8.5 కోట్ల రూపాయలు, హిందీలో 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, తమిళంలో 40 లక్షల రూపాయలు, మలయాళంలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. 10వ రోజున ఈ చిత్రం 13.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

గత 10 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా నైజాంలో 55 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 26 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 15 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు, గుంటూరులో 12 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 8 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 136 కోట్ల రూపాయలు నికరంగా, 194 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. భారీగానే వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో ఇప్పటి వరకు 31.5 కోట్లు, తమిళంలో 10 కోట్లు, మలయాళంలో 2.5 కోట్లు, హిందీలో 59 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 302 కోట్ల రూపాయలు రాబట్టింది.
అలాగే దేవర చిత్రం బ్లాక్ బస్టర్‌గా మారడానికి ఓవర్సీస్ ప్రేక్షకుల ఆదరణే ప్రధాన కారణం. ఈ సినిమా రిలీజ్‌కు నమోదైన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ భారీగా ఊపు తెచ్చింది. నార్త్ అమెరికాతో కలిపి ఇతర దేశాల్లో ఈ సినిమా సుమారుగా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 370 కోట్ల రూపాయలు రాబట్టింది.
దేవర 11వ రోజు కూడా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. పది రోజులపాటు బాక్సాఫీస్‌ను కుమ్మేసిన ఈ చిత్రం రెండో మంగళవారం రోజున సుమారుగా తెలుగులో 4 కోట్ల రూపాయలు, ఇతర భాషల్లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా 7 నుంచి 8 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్‌గా వసూలు చేస్తుంది. దాంతో ఈ సినిమా 390 కోట్ల రూపాయలు మొత్తంగా వసూలు చేసినట్టు అవుతుంది. ఇప్పటి మొత్తంగా 37 కోట్ల రూపాయల లాభాన్ని పంచిపెట్టింది.


Click it and Unblock the Notifications











