Devara 12 days Collections: ఎన్టీఆర్ సరికొత్త చరిత్ర.. దేవర మూవీ రేర్ రికార్డు.. ఎన్ని కోట్లంటే?

ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన దేవర చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. యువ సుధ బ్యానర్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కల్యాణ్ రామ్ నందమూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజై గత 11 రోజుల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ 12వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

దేవర మూవీని తొలుత పూర్తిస్థాయిలో ఒకే ఎడిషన్ లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే కంటెంట్ భారీగా పెరిగిపోవడంతో రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ మూవీని సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

Devara Day 12 Box Office Collections Worldwide Jr NTR movie crossed 400 Club

దేవర సినిమా టీజర్, ట్రైలర్‌కు బారీ స్పందన లభించింది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 185 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 188 నుంచి 190 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. అలా భారీ టార్గెట్‌తో భాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

ఇక ఈ సనిమా గత 11 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీగా కలెక్షన్లు సాధించింది. నైజాంలో ఈ సినిమా 56 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 26 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 15 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.5 కోట్ల రూపాయలు, గుంటూటరులో 12 కోట్లు, కృష్ణా జిల్లాలో 8 కోట్లకుపైగా, నెల్లూరులో 6 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ లాభాల్లోకి చేరింది.

Devara Day 12 Box Office Collections Worldwide Jr NTR movie crossed 400 Club

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. కర్ణాటకలో ఇప్పటి వరక 32 కోట్లు, తమిళంలో 10.2 కోట్లు, మలయాళంలో 2.5 కోట్లు, హిందీలో 62 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 320 కోట్ల రూపాయలు రాబట్టింది.

అలాగే దేవర చిత్రం ఒవర్సీస్‌లో బ్లాక్ బస్టర్‌గా కలెక్షన్లను అందుకొన్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాతో కలిపి ఇతర దేశాల్లో ఈ సినిమా సుమారుగా 77 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సి0నిమా 397 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక 12వ రోజు ఈ సినిమా సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లు, ఇండియాలో మరో కోటి రూపాయలు, ఒవర్సీస్‌లో ఓ కోటి రూపాయలతో 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.దాంతో ఈ సినిమా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X