Devara 2 days Collections: దేవర ఫస్ట్ డే కలెక్షన్లు 172 కోట్లు.. ఎన్టీఆర్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
దేవర సినిమాలో టాప్ మోస్ట్ యాక్టర్లు, ఇండియాలోనే పాపులర్ టెక్నిషియన్స్ పనిచేయడంతో భారీగా ఖర్చు అయింది. ఈ సినిమా కోసం భారీగా వీఎఫ్ఎక్స్ ఉపయోగించారు. దాంతో ఈ సినిమాలో నటించిన వారు, పనిచేసిన వారి రెమ్యునరేషన్లతోపాటు ఇతర ఖర్చులు కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 400 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేశాయి.

దేవర చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడటంతో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 113 కోట్ల రూపాయలు, హిందీ రైట్స్ 20 కోట్లు, కర్ణాటక 16 కోట్లు, తమిళనాడు 10 కోటి రూపాయలు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ రైట్స్ రూపంలో అమ్మకాలు జరిగాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 185 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ రిపోర్ట్.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ కావడం రికార్డుగా మారింది. సుమారుగా 195 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ చిత్రం తొలి రోజు 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. తెలుగు సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.

దేవర సినిమా తొలి రోజు వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన వివరాల్లోకి వెళితే.. తెలంగాణ, ఆంధ్రాలో 82 కోట్ల రూపాయల గ్రాస్, తమిళనాడులో 2.5 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 12 కోట్ల గ్రాస్, కేరళలో 60 లక్షల రూపాయలు, ఉత్తరాది భారతంలో 10 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో ఈ సినిమా 49 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక రెండో రోజు కూడా దేవర చిత్రం స్ట్రాంగ్‌గా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1900 షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్‌గా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్సుగా నమోదు చేసింది. ఈ దాంతో ఈ సినిమా ఇండియాలో 20 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 200 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











