Devara 24 days Collections: దేవర ఆల్ టైమ్ రికార్డు.. ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు, శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం దేవర. యువ సుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం నాలుగో వారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ 24 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
దేవర మూవీని సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 185 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 188 నుంచి 190 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. అలా భారీ టార్గెట్‌తో భాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

దేవర సినిమా నాలుగు వారాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో భారీగా వసూల్లు రాబట్టగా, తమిళం, మలయాళంలో ఓ మోస్తారు వసూళ్లు సాధించింది. తొలి వారంలో 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత 2వ వారంలో 50 కోట్ల రూపాయలు, మూడో వారంలో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు వారాల్లో 335 కోట్ల రూపాయలు నికర కలెక్షన్లను వసూలు చేసింది.
గత మూడు వారాల్లో దేవర చిత్రం వివిధ భాషల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అత్యధికంగా ఆంధ్రా, నైజాం కలిపి ఈ మూవీ 220 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత హిందీలో 74 కోట్ల రూపాయలు, కన్నడలో 35 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 335 కోట్లు వసూలు చేసింది.
రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రచ్చ చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే కలెక్షన్ల రాబట్టింది. దాంతో ఈ సినిమా గత 21 రోజుల్లో ఓవర్సీస్‌లో 91 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక నాలుగో వారంలో మూవీ స్టడీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం నాలుగో శుక్రవారం అంటే 22వ రోజు 1 కోటి రూపాయలు, శనివారం (23వ రోజు) 1.5 కోట్ల రూపాయలు, ఆదివారం (24వ రోజు) 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4.5 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 340 కోట్ల నికరంగా.. 514 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
దేవర చిత్రం 190 కోట్ల రూపాయల టార్గెట్ బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిత్రం ఇప్పటికే సుమారుగా 100 కోట్లకుపైగా లాభాలను డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచి పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ఈవారంతో థియేట్రికల్ రన్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 సంవత్సరంలో బాలీవుడ్‌లో రిలీజైన సినిమాల్లో దేవర హిందీ వెర్షన్ అత్యధికంగా ఆల్ టైమ్ రికార్డులు సాధించిన 8వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











