Devara 25 days Collections: సలార్‌ రికార్డు బ్రేక్ చేసిన దేవర.. ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

దేవర చిత్రం నాలుగో వారంలో కూడా ఇటీవల రిలీజైన కొత్త చిత్రాలకు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆయన బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది. తొలిసారి జాన్వీ కపూర్‌ తెలుగు భాషలోని ప్రేక్షకులకు పరిచయమై భారీ సక్సెస్ అందుకొన్నది. ఈ సినిమా నాలుగో సోమవారం కూడా స్ట్రాంగ్‌గా దేశవ్యాప్తంగా కలెక్షన్లు సాధిస్తున్నది. గత 25 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ బ్యానర్‌పై హీరో నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్వకత్వం వహించారు. సుమారుగా 400 కోట్ల బడ్జెట్, 180 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో సుమారుగా 190 కోట్ల రూపాయల బాక్సాపీస్ టార్గెట్‌తో జర్నీని మొదలుపెట్టింది. ఈ మూవీ తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతూ సంచలనం రేపింది.

Devara Day 25 Box Office Collections

దేవర చిత్రం అత్యధికంగా కలెక్షన్లను సాధించిన చిత్రాల్లో 6వ చిత్రంగా నిలిచింది. బాహుబలి 2, RRR, కల్కి 2898, సాలార్, బాహుబలి చిత్రాలు సాధించిన రికార్డు వసూళ్ల తర్వాత దేవర నిలిచింది. బాహుబలి 1810 కోట్లు, RRR 1236 కోట్లు, కల్కి 2898 AD 938 కోట్లు, సాలార్ 515 కోట్లు వసూలు చేశాయి. ఈ చిత్రాల తర్వాత 24 రోజుల్లో దేవర ప్రపంచవ్యాప్తంగా 515 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.

గత 24 రోజుల్లో దేవర చిత్రం వివిధ భాషల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అత్యధికంగా ఆంధ్రా, నైజాం కలిపి ఈ మూవీ 220 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత హిందీలో 74 కోట్ల రూపాయలు, కన్నడలో 35 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 337 కోట్లు వసూలు చేసింది.

ఇక దేవర చిత్రం 25వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 25వ రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 517 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X