Devara 26 days Collections: షాకింగ్‌గా దేవర కలెక్షన్లు . 26వ రోజు ఎన్టీఆర్ మూవీ వసూళ్లు ఎంతంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ఏకధాటిగా భారీగా కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. జానీ కపూర్ తొలిసారి దక్షిణాదికి పరిచయమై నటించిన ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 25 రోజుల తర్వాత దారుణంగా వసూళ్ల పరంగా క్షీణించింది. ఇలాంటి రికార్డుల సాధిస్తుందనే అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహకు అందని విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా 26వ రోజు ఎన్ని లక్షల వసూళ్లు సాధించిందంటే?

సెప్టెంబర్ 27వ తేదీన రిలీజైన దేవర చిత్రం గత 25 రోజుల్లో ఎన్నడూ కూడా కోటి రూపాయలకు తగ్గకుండా వసూళ్లును సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూడు వారాలపాటు ఈ రకంగా కలెక్షన్లు సాధించడం ఓ రికార్డుగా చెప్పకొన్నాయి. అయితే తొలిసారి 26వ రోజున కొటి రూపాయల కంటే తక్కువగా కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Devara Day 26 Box Office Collections Worldwide

దేవర చిత్రం భారీ తారాగణం, సాంకేతికత నిపుణులతో తెరకెక్కింది. యూనిట్ సభ్యుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ మూవీ 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ భారీగా బజ్ క్రియేట్ చేయడంతో రికార్డు స్థాయి బిజినెస్ చేసింది. ఈ సినిమా 180 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం సంచలనంగా మారింది. సుమారుగా 190 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

దేవర సినిమా పలు భాషల్లో సాధించిన కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో 225 కోట్ల రూపాయలు, హిందీలో 80 కోట్ల రూపాయలు, కన్నడలో 37 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో సినిమా 360 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది.

దేవర చిత్రం ఓవర్సీస్‌లో సృష్టించిన సునామీ కారణంగానే ఇండియాలో బజ్ క్రియేట్ అయింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్ క్రియేట్ చేయడంతో దేశీయంగా కూడా కలెక్షన్లపై ప్రబావం చూపించింది. ఇక దేవర చిత్రం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 513 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించింది.

ఇక దేవర చిత్రం 26వ రోజున తొలిసారి అతి తక్కువ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇండియాలో 60 లక్షలు, ప్రపంచవ్యాప్తంగా 95 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఈ మూవీ ఫస్ట్ టైమ్ అత్యల్పంగా వసూళ్లు సాధించడంతో ఇక ఈ మూవీ కలెక్షన్ల జైత్రయాత్ర ముగించిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X