Devara Nizam, Andhra Collections: దేవరకు 3 రోజుల్లో 304 కోట్లు..ఎన్టీఆర్ మూవీకి నైజాం,ఆంధ్రాలో ఎన్ని కోట్లంటే?

యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు, స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ జంటగా.. సంచలన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వరదను పారిస్తున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది? ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా. 185 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను ఇండియాలో 4000 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 7300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Devara Day 3 Box Office Collections in Andhra and Nizam NTR Movie strong at Telugu States

దేవరకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ భారీగా జరిగింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధికంగా ఆంధ్రా, నైజాంలో బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాం కలిపి 121 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ హక్కులు 48 కోట్లకు, సీడెడ్‌తో కలిపి ఆంధ్రా హక్కులు 73 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. దాంతో ఈ సినిమా సుమారుగా 125 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ మూవీ 3వ రోజు కలెక్షన్లు విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాంలో భారీ వసూళ్లు రాబట్టింది. నైజాంలో సుమారుగా 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, వైజాగ్‌లో 2 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 1 కోటి, పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లక్షలు, క‌ృష్ణా జిల్లాలో 1.25 కోట్లు, గుంటూరులో 1 కోటి రూపాయలు, నెల్లూరులో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు ఈ సినిమా 17 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

Devara Day 3 Box Office Collections in Andhra and Nizam NTR Movie strong at Telugu States

ఇక గత 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దేవర సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 33 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 18 కోట్లు, వైజాగ్‌లో 9.10 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.2 కోట్లు, గుంటూరులో 8.13 కోట్లు, నెల్లురులో 3.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 3 రోజుల్లో 88 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దేవర చిత్రం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌లో మొత్తంగా 70 శాతం రికవరీ సాధించింది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా 40 శాతం వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 304 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ వసూళ్లు జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి ఈ మొత్తం రాబట్టింది.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X