Devara 3 days Collections: 2 రోజుల్లో దేవరకు 220 కోట్లు.. ఎన్టీఆర్ మూవీకి 3వ రోజు ఎన్ని కోట్లంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ జంటగా.. సంచలన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. అంచనాలను మంచి ఈ సినిమా వసూళ్లు సాధిస్తున్నది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. ఈ మూవీ గత 3 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా. 185 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను ఇండియాలో 4000 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 7300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Devara Day 3 Box Office Collections Worldwide Jr NTR movie inching towards 300 crores

దేవర సినిమా సుమారుగా 195 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ సినిమా 172 కోట్లు తొలి రోజు రాబట్టింది. రెండో రోజు 65 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 223 కోట్లు మేర కలెక్షన్లను నమోదు చేసింది.

దేవర సినిమా వివిధ భాషల్లో వసూలు చేసిన వివరాల్లోకి వెళితే.. తెలుగు 74 కోట్ల రూపాయలు నికరంగా, హిందీలో 8 కోట్లకుపైగా, కన్నడలో 12 కోట్ల రూపాయలు, తమిళంలో 2.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాదాపు సుమారుగా 84 కోట్ల రూపాయల నికరంగా వసూలు చేసింది.

Devara Day 3 Box Office Collections Worldwide Jr NTR movie inching towards 300 crores

ఇక దేవర రెండో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 28 కోట్ల రూపాయలు, హిందీలో 9 కోట్ల రూపాయలు, కన్నడలో 10 కోట్ల రూపాయలు, తమిళంలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో 124 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

మూడో రోజు అదే జోష్‌ను దేవర బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. ఈ సినిమా ఇండియాలో 30 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా మూడు రోజుల్లో 260 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X