Devara 5 days Collections: 400 కోట్లకు చేరువగా దేవర.. ఎన్టీఆర్ మూవీకి 5వ రోజు ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అందాల భామ జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ గత 5 రోజులుగా ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తున్నది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పరిస్థితి ఏమిటనే విషయాల్లోకి వెళితే..

దేవర చిత్రం గత 4 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ వీ తొలి రోజు 73 కోట్లకుపైగా, రెండో రోజు 28 కోట్లకుపైగా, మూడో రోజు 28 కోట్లు, నాలుగో రోజు 9 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 138 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

Devara Day 5 Box Office Collections Worldwide Jr NTR movie inching towards 400 crores

ఇక హిందీలో ఫస్ట్ డే 7.5 కోట్ల రూపాయలు, సెకండ్ డే 9 కోట్ల రూపాయలు, మూడో రోజు 11 కోట్లు, నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 32 కోట్ల రూపాయలు రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్‌లో హిందీలో అత్యధిక వసూళ్లు ఈ సినిమావే కావడం విశేషంగా మారింది.

ఇక కర్ణాటకలో 23 కోట్ల రూపాయలు, తమిళనాడులో 7 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు రాబట్టింది. మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 207 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది.

దేవర చిత్రం ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబడుతునున్నది. ముఖ్యంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో 5.1 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 43 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం 5వ రోజున నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఐదో రోజున 306 లొకేషన్లలో 52 వేల డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఉత్తర అమెరికాలో అదనంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా యూఎస్, కెనడాలో 47 కోట్లు వసూలుచేసింది.

Devara Day 5 Box Office Collections Worldwide Jr NTR movie inching towards 400 crores

ఓవర్సీస్‌లో దేవర చిత్రం విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో మంచి ఆదరణను కూడగట్టుకొంటున్నది. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ఇప్పటికే 800k ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. యూకేలో 500K పౌండ్స్ వసూలు చేసింది. థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ 1 మిలియన్ డాలర్లు ఆయా దేశాల్లో రాబట్టే అవకాశం ఉంది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ మూవీ 62 కోట్ల నికర వసూళ్లు కలెక్ట్ చేసింది.

ఇక దేవర చిత్రం 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9 కోట్ల రూపాయలు, ఇతర భాషల్లో 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. హిందీలో 5 కోట్ల రూపాయలు రాబడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 18 నుంచి 20 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటే చేసే అవకాశం ఉంది. తొలివారంలో ఈ సినిమా 400 కోట్లకు చేరువ కాబోతున్నది.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X