Devara 6 days Collections: దేవర కలెక్షన్ల సంచలనం.. 6వ రోజు ఎన్టీఆర్ ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే?

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దేవర చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, సీనియర్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరలు నటించారు. ఈ సినిమా గత 6 రోజులుగా సాధిస్తున్న వసూళ్ల వివరాల్లోకి వెళితే..

దేవర చిత్రం గత 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 62 కోట్లు, రెండో రోజు 18 కోట్లు, మూడో రోజు 19 కోట్లు, నాలుగో రోజు 6 కోట్లు, ఐదో రోజు 6 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో 110 కోట్ల రూపాయల షేర్, 153 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

Devara Day 6 Box Office Collections Worldwide Jr NTR movie Strong at GBOC

గత 5 రోజుల్లో ఏపీ, నైజాంలో ప్రాంతాల వారీగా కలెక్ట్ చేసిన వసూళ్లు ఇలా ఉన్నాయి. ఈ సినిమా నైజాంలో 44 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 20.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 7.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్లు, గుంటూరులో 10 కోట్లు, కృష్ణా జిల్లాలో 6.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత ఐదు రోజుల్లో కర్ణాటకలో 24 కోట్లు, తమిళనాడులో 7.35 కోట్లు, కేరళలో 1.8 కోట్లు వసూలు చేసింది. హిందీ, మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే.. 45 కోట్ల రూపాయలతో సుమారుగా 80 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

Devara Day 6 Box Office Collections Worldwide Jr NTR movie Strong at GBOC

ఇక ఓవర్సీస్‌లో దేవర చిత్రానికి భారీ ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా నార్త్ అమెరికాలో సుమారుగా 6 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 50 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 70 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారుగా 350 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

ఇదిలా ఉండగా, దేవర సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 2వ తేదీ సెలవు దినాన్ని సానుకూలంగా మార్చుకొన్నది. ఈ సినిమా ఇండియాలో సుమారుగా 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 375 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X