Devara 8 days Collections: 6వ స్థానంతో దేవర రికార్డు.. కొనసాగుతున్న ఎన్టీఆర్ బాక్సాఫీస్ ఊచకోత
యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను నమోదు చేస్తున్నది. రెండోవారంలో కూడా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. కల్యాణ్ రామ్ నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా అందరి అంచనాలను మించి కలెక్షన్ల రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఈ మూవీ 8వ రోజు కలెక్షన్ల వివరాలు, ఇప్పటి వరకు సాధించిన రికార్డుల వివరాల్లోకి వెళితే..
దేవర చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. బాహుబలి 2 (1810), RRR (1236), కల్కి 2898 ఏడీ (938), సలార్ (607) , బాహుబలి (515), సాహు (432), ఆదిపురుష్ (412),పుష్ప (365) చిత్రాల తర్వాత దేవర నిలిచింది.

ఇక ఎన్టీఆర్ మూవీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో దక్షిణాది సినిమాల్లో 17వ సినిమాగా నిలిచింది. కేజీఎఫ్, 2.ఓ, జైలర్, లియో, పొన్నియన్ సెల్వన్, ది గోట్, విక్రమ్, కంతారా లాంటి చిత్రాల తర్వాత దేవర చిత్రం 17వ స్థానంలో నిలిచింది.
దేవర చిత్రం గత ఏడు రోజుల్లో ఇప్పటి వరకు 360 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 240 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ సినిమా 48 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన 8వ పాన్ ఇండియా సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

దేవర చిత్రం తొలివారం ఇండియాలో భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగులో 164 కోట్ల రూపాయలు, హిందీలో 44 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియా వైడ్‌గా 225 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది.
ఇక దేవర చిత్రం 5వ రోజు ఈ సినిమా స్ట్రాంగ్‌గా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగులో 3.5 కోట్లకుపైగా, ఇతర భాషల్లో కలిపి 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 8 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











