Devara 9 days Collections: దేవర బాక్సాఫీస్ కలెక్షన్ల జాతర.. ఎన్టీఆర్ మూవీకి 9వ రోజు ఎన్ని కోట్లంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజైన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేస్తున్నది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్వకత్వం వహించారు. యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ తదితరులు నిర్మించిన ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా 9వ రోజు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దేవర చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. గత 8 రోజుల్లో ఈ సినిమా నైజాంలో 51 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 24 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6.5 కోట్లు, గుంటూరు జిల్లాలో 11 కోట్లు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 176 కోట్లకుపైగా గ్రాస్, 125 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది.

Devara Day 9 Box Office Collections Worldwide Jr NTR movie inching to 400 Club

ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తెలుగేతర రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు నమోదు చేసింది. గత 8 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం కర్ణాటకలో 29 కోట్ల రూపాయలు, తమిళనాడులో 9 కోట్ల రూపాయలు, మలయాళంలో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళ, కన్నడ, కేరళలో ఈ సినిమా 40 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక హిందీలో దేవర చిత్రం దూకుడు ప్రదర్శిస్తున్నది. గత 8 రోజుల్లో ఈ మూవీ తొలి రోజు 8 కోట్లు, రెండో రోజు 9.5 కోట్లు, మూడో రోజు 12 కోట్లు, నాలుగో రోజు 4.4 కోట్లు, ఐదో రోజు 4.8 కోట్లు, ఆరో రోజు 7 కోట్లు, ఏడో రోజు 2.5 కోట్లు, 8వ రోజు 2 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 51 కోట్లకుపైగా హిందీలో రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ సినిమా 285 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

Devara Day 9 Box Office Collections Worldwide Jr NTR movie inching to 400 Club

దేవర చిత్రానికి ఓవర్సీస్‌లో భారీగా స్పందన కనిపిస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 7 మిలియన్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక అమెరికా, కెనడా మినహాయిస్తే.. ఈ చిత్రం యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 9.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఓవర్సీస్‌లో నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 360 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిందని పేర్కొన్నారు.

ఇక తొమ్మిదో రోజు కూడా దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఇండియాలో ఈ చిత్రం 7 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొంటున్నారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 370 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఇదే ఊపు కొనసాగితే.. ఈ చిత్రం 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Read more about: devara jr ntr jahnavi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X