Devara Andhra, Nizam Business: ఎన్టీఆర్ కెరీర్లో హైయెస్ట్ బిజినెస్.. దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?
కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
దేవరను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్ , నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. దేవరకు సెన్సార్ క్లియరెన్స్ సైతం కంప్లీట్ అయ్యింది. ఈ మూవీకి సీబీఎఫ్‌సీ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దేవర రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో నందమూరి అభిమానులు దేవర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. ప్రతిచోటా రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా అప్పుడే వన్ మిలియన్ కలెక్షన్లు సాధించిన దేవర ఈ ఘనత దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. దేవర మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరగనున్న జానర్ ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్ 'బియాండ్ ఫెస్ట్'లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ మెగా ఫెస్టివల్ జరగనుంది. సెప్టెంబర్ 26న ఈజిప్టియన్ థియేటర్‌లో దేవర ప్రదర్శన జరగనుండగా.. హాలీవుడ్ సెలబ్రెటీలు దేవరను వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ స్వయంగా అమెరికా వెళ్లనున్నారని ఫిలింనగర్ టాక్

తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నైజాంలో రూ.45 కోట్లు , సీడెడ్‌లో రూ.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు, ఈస్ట్‌లో రూ.7.70 కోట్లు, వెస్ట్‌లో రూ.6.70 కోట్లు, కృష్ణాలో రూ.7.20 కోట్లు, గుంటూరులో 9.60 కోట్లు, నెల్లూరులో రూ.4.80 కోట్లు చొప్పున మొత్తంగా రూ.125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే దేవర తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.125 కోట్లు.
అయితే రూ.125 కోట్ల షేర్ రావాలంటే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది. హిట్ కావాలంటే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. ట్రైలర్ ఫీడ్‌బ్యాక్, కొరటాల టేకింగ్, ఎన్టీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











