Devara Nizam, Andhra Business: దేవర నైజాం, ఆంధ్రా బిజినెస్ ఎంత? ఎన్ని కోట్లు వస్తే ఎన్టీఆర్ మూవీ లాభాల్లోకి?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ అభిమానుల్లో మరింతగా అంచనాలు పెంచాయి. అంతేకాకుండా బిజినెస్ వర్గాల్లో కూడా భారీ చర్చ జరుగుతున్నది. ట్రైలర్‌కు ఎలాంటి నెగిటివ్ టాక్ ఎక్కువగా లేకపోవడం వల్ల కొంత ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ అంశంగా మారింది. అయితే ఈ సినిమా తెలుగు, రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..

ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మిస్తున్న చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, అలాగే సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 160 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు సమాచారం. ఇక ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ 165 కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Devara Movie Pre Release Business in Telugu States Here Jr NTR s break Even Target details

ఇక దేవర ప్రీ రిలీజ్ బిజినెస్‌కు భారీగా స్పందన లభిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయనేది ఇండస్ట్రీ టాక్. ఇక తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ హక్కులను చేజిక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు భారీగా పోటీ పడ్డారని ఫిలిం నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 95 కోట్ల రూపాయల మేర జరిగింది. నైజాం హక్కులను సుమారుగా 42 కోట్ల రూపాయలు, ఆంధ్రా, సీడెడ్ కలిపి 53 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా 95 కోట్ల మేర బిజినెస్ జరిగింది. RRR తర్వాత 6 ఏళ్ల అనంతరం ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఇలాంటి డిమాండ్ కనిపించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Devara Movie Pre Release Business in Telugu States Here Jr NTR s break Even Target details

అయితే దేవర సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ టార్గెట్ ఉందనే విషయం స్పష్టమైంది. ఎగ్జిబిటర్ కమిషన్లు, స్టేట్ టాక్స్, థియేటర్ మెయింటెనెన్స్, జీఎస్టీ అన్ని కలిపితే ఈ సినిమా సుమారుగా 100 కోట్ల మేర షేర్ సాధించాల్సి ఉంటుంది. అంటే ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో కనీసం తెలుగు రాష్ట్రాల్లో 210 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఉన్న హైప్ ప్రకారం దేవర సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం తథ్యం. ఈ సినిమా ఫస్ట్ షో ప్రదర్శించిన తర్వాతే టాక్‌ను బట్టి మూవీ కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ షో తర్వాత వచ్చే టాక్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఈ సినిమా ఫలితం గురించి వేచి చేయాల్సిందే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: devara jr ntr janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X