Devara Business దేవర ప్రీ రిలీజ్ బిజినెస్‌తో మైండ్ బ్లాక్..NTR కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా! ఎన్ని కోట్లంటే?

RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు రివీల్ అయ్యాయి. ఈ బిజినెస్ వివరాలు చూసి తారక్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. దేవర డిమాండ్ రిఫ్లెక్ట్ చేసేలా భారీ ఎత్తున బిజినెస్ జరిగిందనే సమాచారం వైరల్ అవుతోంది.

Devara movie pre release business Jr NTR getting huge demand theatrical rights worldwide

పవర్‌ఫుల్ టైటిల్.. భారీ యాక్షన్ సీన్స్:
దేవర అనే పవర్‌ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ చూడబోతున్నామనే హింట్స్ ఇచ్చేశారు మేకర్స్. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఒక్కో అప్‌డేట్ వదులుతూ నందమూరి లోకాన్ని హుషారెత్తిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు భారీ తారాగణం భాగమవుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తగు జాగ్రత్తలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

Devara movie pre release business Jr NTR getting huge demand theatrical rights worldwide

జాన్వీ కపూర్‌ ఎంట్రీ:
దేవర సినిమాతో బాలీవుడ్ బ్యూటీ, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేసి ఆమె జారెక్టర్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు కొరటాల శివ. మరోవైపు తన తొలి సినిమానే జూనియర్ ఎన్టీఆర్ తో చేయడం పట్ల సంతోషంగా ఉందని, ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనే ఆతృత తనకు కూడా ఉందని చెప్పి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది జాన్వీ.

ఎన్టీఆర్ ఉగ్రరూపం:
ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కళ్ళు చెదిరేలా ఉండనున్నాయట. సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే అండర్ వాటర్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయట. గోవా చిత్రీకరించిన ఈ సన్నివేశాలు సినిమాకే తలమానికం కానున్నాయట. ఎన్టీఆర్ ఉగ్రరూపం, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రోల్ నందమూరి అభిమానుల చేత గోల పెట్టించనుందట.

Devara movie pre release business Jr NTR getting huge demand theatrical rights worldwide

భారీ బిజినెస్.. కళ్ళు బైర్లు కమ్మే డబ్బు:
ట్రేడ్‌ వర్గాల సమాచారం మేరకు దేవర మూవీకి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 130కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట మేకర్స్. అయినప్పటికీ ఇందుకోసం కొన్ని పేరున్న సంస్థలు పోటీపడుతున్నాయట. వరల్డ్ వైడ్ బిజినెస్ చూస్తే ఏకంగా 400 కోట్ల దాకా జరుగుతోందనే టాక్ బయటకొచ్చింది.

దేవర రిలీజ్ డేట్:
ఇప్పటికే దేవర ఓవర్సీస్‌ రైట్స్ 27 కోట్లకు అమ్ముడుపోగా.. ఆడియో రైట్స్ 33 కోట్లకు టీ- సిరీస్‌ సంస్థ దక్కించుకుంది. ఈ క్రమంలోనే థియేట్రికల్ రైట్స్ విషయంలో పోటీ నెలకొంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X