దేవర టోటల్ బడ్జెట్ ఎంత?.. ఎన్టీఆర్, ఒక్కో స్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రెజెంట్ టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా అంటే అది హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం "దేవర" అనే చెప్పాలి. అసలే ఈ ఏడాదిలో సక్సెస్ రేట్ ఎక్కువగా లేదు. పైగా పాన్ ఇండియా కూడా తక్కువే వచ్చాయి. మరి మొన్న జూన్ లో ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" థియేటర్స్ లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యింది.
కాగా ఈ చిత్రం తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ చిత్రం "సరిపోదా శనివారం" పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యింది కానీ ఒక్క తెలుగు మినహా మిగతా భాషల్లో మాత్రం తేలిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగు నుంచి వస్తున్న క్రేజీ పాన్ ఇండియా సినిమానే "దేవర".

మరి ఎన్టీఆర్ ఇంకా దర్శకుడు కొరటాల శివ కలయికలో రెండో సినిమాగా అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో సినిమాగా ఇది వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని క్వాలిటీ పరంగా మేకర్స్ ఎక్కడా తగ్గకుండా భారీ హంగులతో సిద్ధం చేశారు. ఇలా ఈ చిత్రానికి ఓవరాల్ గా పెద్ద బడ్జెట్ పెట్టినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా సినీ వర్గాల టాక్ ప్రకారం దేవర చిత్రానికి ఏకంగా 300 కోట్ల బడ్జెట్ అయ్యిందట.
ఇందులో ఎక్కువ శాతం సినిమా వి ఎఫ్ ఎక్స్ కే పెట్టినట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సహా చాలా మంది ఎన్టీఆర్ సహా చాలా మంది స్టార్స్ ఉండగా వారి పారితోషికాలు కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి. మరి ఎన్టీఆర్ నుంచే మొదలు పెడితే తారక్ ఈ సినిమాకి 60 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ని తీసుకున్నాడట. అలాగే డెబ్యూ హీరోయిన్ జాన్వీ కపూర్ ని ముందుగా 3.5 కోట్లకి అనుకుంటే తర్వాత ఆమె 5 కోట్లు డిమాండ్ చేసిందట.

దీనితో ఆ మొత్తం ఇచ్చారని తెలుస్తుంది. ఇక విలన్ సైఫ్ అలీఖాన్ కూడా గట్టిగానే తీసుకున్నాడట. తాను ఈ చిత్రానికి 10 కోట్లు అందుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకో మెయిన్ స్టార్ రాక్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ పే చెక్ కూడా భారీ మొత్తమే అట. తాను ఈ సినిమాకి కంపోజ్ చేసేందుకే 10 కోట్లు తీసుకున్నాడని వినికిడి. ఇక వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా 1 కోటికి పైగానే అందుకున్నారట.
ఇలా దేవర లో వర్క్ చేసిన అందరి బిగ్ స్టార్స్ కి భారీ మొత్తమే రెమ్యునరేషన్ రూపంలో అందించారట. ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా వరల్డ్ వైడ్ గా పెద్ద మొత్తమే చేసినట్టు తెలుస్తుంది. సుమారు 400 కోట్లకి పైగానే అన్ని హక్కులు కలిపి దేవర ముగించాడట. ఇక థియేటర్స్ లో వచ్చాక సినిమా పరిస్థితి ఏంటి అనేది రివీల్ కానుంది. ఇక ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దేవర విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











