Devil Collections డెవిల్ కలెక్షన్లు పేలవంగా.. బింబిసారతో పోల్చితే దారుణంగా!

బింబిసార హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చిత్రం డెవిల్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించిన సినిమాలో యువ హీరోయిన్లు సంయుక్త మీనన్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 29వ తేదీన రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాలతోపాటు కలెక్షన్లు ఎంతొచ్చాయనే విషయంలోకి వెళితే..

Recommended Video

Devil Boxoffice కల్యాణ్ రామ్ Devil కలెక్షన్స్ ఈ విధంగా.. | Telugu Filmibeat

నందమూరి హీరో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించిన డెవిల్ చిత్రం తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ రెస్సాన్స్ సొంతం చేసుకొన్నది. డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో తెరకెక్కినప్పటికీ.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందంటూ క్రిటిక్ పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డెవిల్ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Devil day 1 expected Collections Worldwide: Kalyan Ram movie sluggish Start at Box office

ఇక డెవిల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను 45 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ఇటీవల ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత అభిషేక్ నామా వెల్లడించారు. ఈ సినిమాకు వేసిన సెట్స్, ఉపయోగించిన క్యాస్టూమ్స్, గ్రాఫిక్ వర్క్ కారణంగా బడ్జెట్ తడిసిమోపడైందని చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చెప్పడం తెలిసిందే.

ఇక డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కల్యాణ్ రామ్ గత సినిమాలతో పోల్చుకొంటే భారీగానే బిజినెస్ జరిగిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను 5.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 8 కోట్ల రూపాయలు కలిపి తెలుగు రాష్ట్రాల బిజినెస్ 17.5 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Devil day 1 expected Collections Worldwide: Kalyan Ram movie sluggish Start at Box office

ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ 1.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఓవర్సీస్ రైట్స్ 2 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.దాంతో ఈ సినిమా హక్కులు 21 కోట్ల రూపాయలు మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ఈ సినిమా ముందు బాక్సాఫీస్ టార్గెట్ భారీగానే ఉంది అని పేర్కొన్నారు.

డెవిల్ సినిమాను సుమారుగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 450 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక మార్నింగ్ షోకు పెద్దగా స్పందన కనిపించకపోగా 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తాజా సమాచారం ప్రకారం.. మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 28 శాతం, సెకండ్ షోకు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు వైజాగ్, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్‌లో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

సినిమా 42 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 21 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది. అయితే ఈ సినిమా తొలి రోజు ఇండియా వైడ్ 2 కోట్లు నికరంగా, ఓవర్సీస్‌లో 50 లక్షల గ్రాస్ వసూళ్లు కలిపి మొత్తంగా 5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Devil day 1 expected Collections Worldwide: Kalyan Ram movie sluggish Start at Box office

ఇక కల్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బింబిసార మూవీతో పోల్చుకొంటే పేలవమైన కలెక్షన్లను డెవిల్ నమోదు చేస్తుందనే విషయం స్పష్టమైంది. బింబిసార తొలి రోజు 11.5 కోట్ల గ్రాస్, 7 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. ఆ సినిమాతో పొల్చితే డెవిల్ ఎలా పెర్ఫార్మ్ చేసిందంటే?

  • డెవిల్ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
  • డెవిల్ రెండో రోజు కలెక్షన్లు కొంత మేరకు డ్రాప్ అయ్యాయి. 2వ రోజున 3.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
  • డెవిల్ మూవీ మూడో రోజు కలెక్షన్లలో మెరుగు సాధించింది. 3.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
  • డెవిల్ సినిమా స్టడీగా వసూళ్లు సాధించింది. 4వ రోజున 3.25 కోట్ల రూపాయలు రాబట్టింది.
  • డెవిల్ చిత్రం 5వ రోజున బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయింది. ఐదో రోజున కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసింది.
  • కల్యాణ్ రామ్ డెవిల్ 6వ రోజున 60 లక్షల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X